Skip to main content

Telugu News Power

లయన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గా ముత్యాల రామారావు.

అవార్డు స్వీకరిస్తున్న ముత్యాల రామారావు.

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణాజిల్లా లయన్స్ 316డి, జిల్లా, “లయన్ ఆఫ్ ద డిస్టిక్” అవార్డుకు, పాలకొల్లుకు చెందిన సీనియర్ పాత్రికేయులు ముత్యాల రామారావు ఎన్నికయ్యారు. ఈ అవార్డు 2024- 25 కు గాను విజయవాడలో ఆదివారం జరిగిన బహుమతి ప్రధానోత్సవం సభలో జిల్లా గవర్నర్,గద్దె శేషగిరిరావు అందజేశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా వీరిని వరించింది. జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు సమక్షంలో, ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్, పి సుభాష్ బాబు ఈ బహుమతిని ముత్యాలకు బహుకరించారు. రత్న ప్రింటింగ్ ప్రెస్ అధినేతగా సుదీర్ఘ అనుభవం ముత్యాలకు సొంతం. వీరంటే ఉమ్మడి కృష్ణ,పశ్చిమగోదావరి జిల్లాలో తెలియని వారు ఉండరు. రామారావు గత 28 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ కు తన సేవలు అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ తరఫున వైద్య శిబిరం జరిగిన, వరద బాధితులకు సహాయ సహకారాలు అందించవలసినప్పుడు రామారావు ఇంటి నిండా అవే సరుకులు,వస్తువులు దర్శనమిచ్చేవి. వాటిని బాధితుల యొక్క గమ్యస్థానాలు చేరేవరకు బాధ్యతనంత తన భుజాలపై ఎత్తుకొని నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలుపడినప్పటికీ, తన విధులు హృదయపూర్వకంగా నిర్వర్తించేవారు. వీరి సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు వీరిని అక్కున చేర్చుకున్నాయి. జిల్లా గవర్నర్ న్యూస్ లెటర్ ఉత్తమ ఎడిటర్ గా రెండుసార్లు రాష్ట్రస్థాయిలో బహుమతి అందుకోవటం లో వారి పాత్రికేయ అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. మోస్ట్ కమిటెడ్ లయన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు రామారావు అందుకున్నారు. గత ఏడాది రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యారు. వీరికి ఉన్న సేవాభావంతో లైన్స్ క్లబ్ తో పాటు మానవతా స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. మీరు పాలకొల్లు మండల శాఖ కన్వీనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. వీరు అవార్డులు అందుకున్న సందర్భంగా పలువురు రామారావుకు అభినందనలు తెలియజేశారు.