పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ, స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద గల హర్ష మెడి ల్యాబ్ సంయుక్తంగా, ఆదివారం, స్థానిక టౌన్ హాల్ వద్ద, షుగర్, బిపి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 125 కి పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. స్థానిక బస్ స్టేషన్ వద్ద, ఈ శిబిరం ద్వారా ఎక్కువ మందికి సేవలు అందించాలని చూసినప్పటికీ స్థానిక ఆర్టీసీ అధికారులు నిరాకరించడం పట్ల సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో పెనుమాక రామ్మోహన్ రావు, గవర్నర్, కానూరు ప్రభాకర్ రావు అధ్యక్షులు, గుండుమోగుల వీరస్వామి కార్యదర్శి, కొండ్రెడ్డి సూరిబాబు కోశాధికారి, కటారి నాగేంద్ర కుమార్, జక్కంపూడి మదన్ రవి, కర్ర నరసింహారావు, కంచు స్తంభం సుబ్రహ్మణ్యం, వినుకొండ శేషాద్రి, పస్యావుల రవీంద్ర, నూకల సత్యనారాయణ, గంధం ఏసు పాదం, ఉనికిల శ్రీనివాస్, అల్లం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ హెల్త్ క్యాంప్
కాపు ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న వైద్య శిబిరం