పాలకొల్లు: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కాం) కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మీడియా ప్రనిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం నుంచి 400 కంపెనీలనుభయపెట్టి తరిమేసిందన్నారు. నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత,గంజాయి,మత్తుమందుల్లో మునిగి, భవిష్యత్తు నాశనం చేసుకున్నారన్నారు. నేటి ప్రభుత్వం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారినీ, వారి ప్రతిభని గుర్తించి, మేలుకొల్పుతుందంన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే 6 లక్షల ప్రైవేటు,ప్రభుత్వ ఉద్యోగాలు కల్ఫింపించామన్నారు. ఉగాది సందర్భంగా, మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మరోసారి 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగులకు ఉగాది కానుకగా ఇచ్చారన్నారు. వివిధ కంపెనీలతో 13 లక్షల కోట్ల రూపాయల మేరకు అవగాహన ఒప్పందాలు కూటమి ప్రభుత్వం కుదుర్చుకుందన్నారు. ఈ కంపెనీలలో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. మెగాడిఎస్సి లో 16,300 పోస్ట్లు, పోలీసు తదితర శాఖలలో ఇప్పటికే 6వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చి, పరిశ్రమలు, ఎం ఎస్ ఎం ఈ కంపెనీలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటానికి కూటవి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్థి, ధనానీ సూర్య ప్రకాష్, గణపతి రావు తదితరులు పాల్గొన్నారు

ఉద్యోగ కల్పన పై ప్రకటన చేస్తున్న మంత్రి నిమ్మల