Telugu News Power

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి -మావుళ్ళమ్మ అనుగ్రహం కోరిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ను కోరుకున్నట్టు ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ కులపతి రామాంజనేయులు వెల్లడించారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా, గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులకు సన్మానం చేశారు.
శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా జరిగిగాయి. ఉదయం దేవస్థానం వారు పంచాంగ శ్రావణం నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ ఉప ప్రధాన అర్చకులు కొడమంచలి కొప్పేశ్వరరావు, ఆలయ వేదపండితులు వై శ్రీనాథ్ శర్మ, కాళ్ల శివాలయం అర్చకులు శ్రీ తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ వారికి దేవస్థానం తరపున సత్కరించారు.గొల్లలకోడేరు వాస్త్యవ్యులు అవధానరాజహంస సవస్రావధాన భాస్కర అవధానవిద్యా విరించి కోట వెంకట లక్ష్మి నరసింహం వారిచే ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ఆలయ ధరకర్తలు పాల్గొన్నారు.

ఉగాది వేడుక ల్లో ఎమ్మెల్యే అంజిబాబు