పాలకొల్లు: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి చీఫ్ సూపరిండెంట్ డాక్టర్ యర్రా మాధురి సోమవారం వెల్లడించారు. తన నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆసుపత్రిలో, డాక్టర్లు25 మంది, స్టాఫ్ నర్స్ లు 24 మంది, హెడ్ నర్సులు 4 లతో ఆస్పత్రి పూర్తిస్థాయి సిబ్బందితో పని చేస్తుందన్నారు. డాక్టర్ జనార్దన్ బాబు, కమిటీ చైర్మన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలు -వైద్యాధికారిణి డాక్టర్ మాధురి