Telugu News Power

వంగవీటి అరంగేట్రం ఏ వెలుగులకుఈ ప్రస్థానం

వంగవీటి వంశ వారసురాలు ఆషా కిరణ్ తొలిసారి ప్రజా జీవితంలోకి నవంబర్ 16న అరంగేట్రం చేశారు. ఆ రోజు కార్తీక సమారాధన పలుచోట్ల జరిగింది. ఈ సందర్భంగా ఆశకిరణ్ ఉపయోగాలు ఉభయ గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులను ఆమె కలుసుకొన్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట కొందరు పెద్దలు కూడా అనుసరించారు. ఈమె పర్యటన ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రంగా అభిమానులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అనేక ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ఉన్నారు. అయితే వంగవీటి బ్రాండ్ ఆ కుటుంబంలో వారు అంతగా అంది పుచ్చుకోలేక పోయారు. అధికారాన్ని కొనసాగించలేక పోయారు. కాపునాడు నాయకుడుగా ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ముందుకు వచ్చారు. కాపులకు రిజర్వేషన్ సాధించడం కోసం ఆయన చేసిన ఉద్యమం కాపుల్లో ఆయన పట్ల అభిమానం కలుగజేసి జేసింది. అయితే ఆ తర్వాత ఆయన ఉద్యమానుంచి వైదొలిగారు. అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగుపెట్టారు. అయితే రాజకీయ నాయకులు ఏదో ఒక కులానికి మాత్రమే పరిమితం కాకుండా, విశాలమైన దృక్పథంతో అన్ని కులాలను కలుపుకు పోవాల్సి ఉంటుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ కాపుల అభిమానం పొందవచ్చు కానీ,అచ్చమైన కాపు నాయకుడు మాత్రం కాలేరు. ప్రస్తుతం రాష్ట్రం లో ఎందరో కాపు నాయకులు ఉన్న కూడా, కాపు జాతిని ముందుండి నడిపించే సామర్థ్యం కనపర్చటం లేదు. ఈ లోటు పూడ్చడానికి వంగవీటి ఆశకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం, అనివార్య అవకాశం గా కనిపిస్తుంది. వంగవీటి రంగా రాధా రంగా మిత్రమండలి నడిపించడం దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన క్రమం అనితర సాధ్యం. బడుగు బలహీన వర్గాల వారికి ఆపద్బాంధవుడుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు రంగా దగ్గర వేచి ఉన్న సందర్భాలు ఉన్నాయని చెబుతారు, కాంగ్రెస్ పార్టీలో ఎందరో నాయకులు రంగా అనుచర్లుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఎన్నికలకు ఆరు నెలల ముందే ఎమ్మెల్యేగా తన పేరును ప్రకటించుకుని ప్రచారం చేసుకున్న సత్తా ఉన్న నేత, ఏకైక నాయకుడు వంగవీటి రంగ. ఆయన మరణానంతరం అవి భక్త ఆంధ్రప్రదేశ్ అల్లర్లతో అట్టుడికి పోయింది .తరువాత జరిగిన పరిణామాలుఅంతకుముందు ఉన్న అధికారి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు చేసింది. రంగా అంటే వ్యక్తి కాదు శక్తిని నిరూపించింది. రంగా మరణం వల్ల వచ్చే ఫలితాన్ని ముందుగానే అంచనా వేసిన రాజకీయ ఉద్దండులు కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు అనుభవించారు. ఇంతటి లెగసి ఉన్న వంగవీటి కుటుంబం, రత్నకుమారి ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యారు. ఆ తర్వాత వారి కుమారుడు రాధాకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. జగనన్న ఎంపీ సీటు ఇస్తానన్నా వద్దని, ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు పట్టారు కానీ అవకాశం రాలేదు. అప్పుడు ఎంపీగా పోటీ చేసి ఉంటే పార్లమెంటును కూడా చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశంలో కొనసాగుతున్న తున్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ ఏ పార్టీలోకి చేరతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక మహిళగా రాజకీయాల్లో ఎంతవరకు నీకు నెగ్గుకు రాగలుగుతారనేది ఆమె తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. లేదంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ము కోవటం అన్ని సార్లు అయ్యే పని కాదు. ఇంతవరకు స్తబ్దుగా ఉన్న ఆధారంగా రాధా రంగా మిత్రమా మిత్రమండలి తదితర అనుబంధ సంస్థలు జరిపే కార్యక్రమాలకు తాను హాజరవుతానని ఆశకిరణ్ ప్రకటించారు ఈమె రాకతో ఆయా సంఘాలు చైతన్యవంతమైపునరుత్తేజం పొందవచ్చు.వారసత్వం సదరు వ్యక్తులు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అందులోనూ పులి మీద స్వారీ లాంటి రాజకీయ రంగంలో రాణించటం అంతా సులువైన విషయం కాదు. రాజశేఖర్ రెడ్డి వారసులుగా రాజకీయాల్లో పెనుఉప్పెనలా వచ్చిన, వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని గప్పున తాటకు మంటల ఐదేళ్లకే ముగిసింది .ప్రజల ఆశలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎంతటి వారికైనా పరాజయం తప్పదు. అప్పుడు కులమతాలకు తావుండదు. రాబోయే రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయాలు ప్రాతిపదిక ,ఆమె రాజకీయ జీవితం వెలుగుల దారిలో పయనించవచ్చు. రంగా ఆశయాల కోసం పనిచేస్తానని ఆమె ప్రకటించారు. ఇందువల్ల రంగా అభిమానుల ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే కాలం ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.