భీమవరం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, వారం రోజులు ముందు నుంచే వాడు వాడల జెండా పండుగ నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ప్రజా ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు, జయంతి సందర్బంగా,మార్చి,29న ప్రారంభం కావలసిన వాడవాడలా టిడిపి జెండా పండగ, భీమవరంలో వారం రోజులు ముందే రాజ్యసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి సోమవారం ప్రారంభించారు.
పట్టణంలోని 1 వార్డు మెంటేవారితోటలో జండా స్థూపాన్ని ప్రారంభించి టిడిపి జెండా ఆవిష్కరించారు. పట్టణంలోని 3,10,16,17,18,19 వార్డులలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం వారం రోజులు ముందుగానే నియోజకవర్గంలోని వాడవాడలా టిడిపి జెండా పండుగను నిర్వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వారం రోజులు ముందే టిడిపి జెండా పండుగ.
టిడిపి జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ సీతారామలక్ష్మి