పాలకొల్లు:నవంబర్, 26 (తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పాలకొల్లు మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జట్టు కార్మికులు బుధవారం ఈ కార్యక్రమము నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించిన 26 వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పని గంటల సమయాన్ని గతంలోని ఎనిమిది గంటలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఐటియు నాయకులు రాజు, మండల సిఐటియు నాయకులు దేవ సుధాకర్, జవ్వాది శ్రీనివాస్, తదిర నాయకులు, ప్రభుత్వ పౌరసరఫరా గోడౌన్,ఏఎంసి కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.