Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన వితరణకు రూ.40 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన దాన ప్రసాద వితరణకు, రాజోలు సమీప మోరి వాస్తవ్యులు బళ్ళ నాగ మణికంఠ రూ.40 వేల విరాళం ఆదివారం సమర్పించుకొన్నారు. ఆలయ అర్చకులు ఈ భక్తులకు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు యండ సత్యవతి ప్రసాద్ దాతలకు అమ్మవారి చిత్రపటం,ప్రసాదాలు అందజేశారు.

నిత్య అన్నదాన పథకానికి విరాళం సమర్పిస్తున్న భక్తులు నాగమణికంఠ