హైదరాబాద్: మార్చి,16(తెలుగు న్యూస్పవర్.కామ్)భారతదేశానికి, ముఖ్యంగాదక్షిణ భారతదేశానికి సినిమా ఓ అతి ముఖ్యమైన సాంస్కృతిక బంధమని పవర్ స్టార్, డిప్యూటీ ముఖ్యమంత్రి,పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఊస్తాద్, భగత్ సింగ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సోమవారం హైదరాబాదులో జరిగిన వేడుకలో ప్రసంగించారు. ఒక్కో సినిమా మనిషిని చైతన్య పరిచి మళ్లీ ముందుకు నడిపిస్తుందని తన అనుభవాన్ని వివరించారు. సినిమా వల్ల ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్న, అది సమాజానికి మేలు చేస్తుందన్నారు. కర్ణాటకలో సినిమాలు బంద్ చేసినప్పుడు, అక్కడ నేర ప్రవృత్తి బాగా పెరిగిందని పోలీసులు తమ పరిశోధనలో వెల్లడించారన్నారు. తను చేసే సినిమా లెక్కలు తనకు తెలియవని, నిర్మాత బావుండాలి, అభిమానులకు ఆనందం కలగాలని మాత్రమే తాను సినిమాలు చేస్తానన్నారు. భాషా, ప్రాంతం వంటి సంకుచిత భావంతో కాకుండా భారతీయ సినిమాను చూడాలని కోరారు. తన హీరో ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవేనని వెల్లడించారు. ఈ చిత్ర నిర్మాణంలో పాల్గొన్న,తమ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ, ఉగాది కి ఈ సినిమా విడుదల చేస్తుంది. హరీష్ శంకర్, శ్రీ లీల, దేవి శ్రీ ప్రసాద్, చిత్రంలోని నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానులు వేలాదిగా హాజరయ్యారు.
సినిమా భారతీయ సంస్కృతిలో విడదీయరా అని ఓ బంధం. -పవర్ స్టార్ పవన్ కళ్యాణ్