Skip to main content

Telugu News Power

ఫిలింఫేర్ 70వ అవార్డుల వేడుక పుష్పాకు అవార్డుల పంట.

చిరంజీవి, అర్జున్ మామ కు తగ్గ అల్లుడు

కోచ్చి: ఫిబ్రవరి,22(తెలుగు న్యూస్ పవర్) సినిమా అవార్డులకు పెట్టింది పేరైన, ప్రతిష్టాత్మక 70వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఆదివారం, కేరళ రాష్ట్రం, కొచ్చి లో జరిగింది. తారలు దిగివచ్చిన వేళ, అభిమానుల్లో ఉప్పొంగిన ఆనందం హేళ, సినిమా సంబరాలు అమరాన్నంటాయి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పుష్ప 2 ది రూల్ ఐదు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అవార్డు తన అభిమానులకు అంకితం చేశారు. దేవతల దేశంగా పిలువబడే కేరళ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి
ఫిలింఫేర్ అవార్డు 7 సార్లు తీసుకున్నారు. ఈ అవార్డు రికార్డు, ప్రస్తుత అవార్డుతో అల్లు అర్జున్ సమం చేశారు.