Telugu News Power

సినీ నిర్మాత “అట్లూరి” అందరికీ ఆదర్శం.

పూర్ణచంద్రరావు సత్కరిస్తున్న వెంకయ్య నాయుడు, మురళీమోహన్, కె ఎస్ రామారావు

హైదరాబాద్: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ కావాలి)
సినీ నిర్మాత, అట్లూరి పూర్ణచంద్రరావుకు నవతి (90వ పుట్టినరోజు) మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీరు గేట్ కీపర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. కేవలం ఐదు రూపాయలు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా 87 సినిమాలు, 9 భాషల్లో నిర్మించారు. వీరు తీసిన సినిమాలు ఎన్నో చరిత్ర సృష్టించాయి. సినిమాకు, విజయాలతో పాటు, విలువలు చేర్చిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఈయన సినీ ప్రస్థానం, ఎందరికో పాఠ్యపుస్తకం. లక్ష్యాలు సాధించడానికి ఈయన జీవితం ఒక ఆదర్శం. తాను ప్రారంభించిన ప్రతి రంగంలోని విజయం సాధించిన ఘనుడు, పరిపూర్ణుడు, పూర్ణచంద్రరావు. ఈ సందర్భంగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, ముప్పవరపు వెంకయ్య నాయుడు, పద్మశ్రీ మురళీమోహన్, దిల్ రాజు, కేఎస్ రామారావు తదితరులు ఘనంగా పూర్ణచంద్రరావు సత్కరించారు.