Telugu News Power

హనుమద్ వ్రత రథోత్సవం

రధోత్సవం

యలమంచిలి:డిసెంబర్,11
(తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి హనుమద్ వ్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రాత్రి రథోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలు ఈనెల 3 నుంచి 11 వరకు తొమ్మిది రోజులు పాటు జరిగాయి. గంధం గంగాధర్, నాగమణి దంపతుల చే ఈ పూజలు ప్రారంభించారు. స్వామి వారికి పంచామృత అభిషేకం, తమలపాత్ర పూజ వంటి పూజలు జరిపారు. రథోత్సవం కోలాటం భజన, నృత్యబృందాలతో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో పలువురు దంపతులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులు కార్యక్రమాన్ని బోలిశెట్టి రావులయ్య దంపతులు పాల్గొని, పర్యవేక్షించారు.