Skip to main content

Telugu News Power

ఉద్యోగుల హెల్త్ కార్డ్ లపై అధికారిక కమిటీ.

అమరావతి:డిసెంబర్,11(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ కార్డు సంబంధించి అధికారిక కమిటీని గురువారం సాయంత్రం,ప్రకటించింది. ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఇచ్చిన హామీ మేరకు ఈ కమిటీ ఏర్పాటు అయింది. కమిటీలో ఏడుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ (ఎక్స్పెండిచర్ అండ్ హెచ్ఆర్), కార్యదర్శి(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ), ఏపీ ఎన్జీవో నాయకులు విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సభ్యులుగా ఉంటారు. వీరంతా హెల్త్ కార్డుకు సంబంధించి వివిధ సమస్యలపై పరిష్కారాలు చూపుతూ రెండు నెలల్లో నివేదిక ఇవ్వవలసిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.