Telugu News Power

విజయ ల్యాబ్ బ్లడ్ గ్రూపింగ్ శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు,విజయ డయాగ్నొస్టిక్ ల్యాబ్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, మొదటి సంవత్సరం విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రిన్సిపల్ టి. రాజరాజేశ్వరి తెలియజేశారు. విద్యార్థులు రక్తదానం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని పొందడానికి ఈ బ్లడ్ గ్రూపింగ్ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విజయ ల్యాబ్ అధినేత కాలేజీ గవర్నింగ్ బాడీ సభ్యులు కొమ్ముల మురళీకృష్ణ మరియు వారి…

Read More

ఉద్యోగార్థులకు శిక్షణ

పాలకొల్లు: డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్)ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ అటానమస్ కళాశాల లో డిగ్రీ చివరి ఏడాది విద్యార్థుల కోసం ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభించారురు. విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వారం రోజులపాటు జరుగుతుంది. మహిళా సాధికార విభాగం, జవహర్ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

సఖినేటిపల్లి:డిసెంబర్,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అంతర్వేది లో వేంచేసి ఉన్న, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి ఉత్సవ ఏర్పాట్ల గురించి గురువారం అధికారులు సమీక్షించారు. ఈ ఉత్సవాలు జనవరి,25 నుంచి మొదలై ఫిబ్రవరి,2తోముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో తొలి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపం అలంకరణ, రథాన్ని సన్నద్ధం చేయటం, శ్రీవారి చక్రస్నానం ఏర్పాట్లు, చలువ పందిర్లు, విద్యుత్ సౌకర్యం, క్యూలైన్లు…

Read More

వజ్ర సంకల్పం ముందు వైకల్యం ఓటమి

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) వైకల్యాన్ని ఎదిరించి నిలిచిన నిలువెత్తు స్ఫూర్తి వేదాంతం సదాశివమూర్తి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలానికి చెందిన, ప్రస్తుతం పాలకొల్లులో స్థిరపడ్డ వీరి జీవితం దివ్యాంగులకు ఓ ఆచరణీయ మార్గదర్శి. రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు మోకాలు వరకు తొలగించవలసి వచ్చింది. తీవ్రమైన శారీరిక బాధను మానసిక వేదనను తట్టుకుని నిలబడిన మేరు పర్వతం సదాశివమూర్తి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పట్టా పొంది, ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ వాహనాలను ఎంత…

Read More

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏటా డిసెంబర్ 3 న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1992లో ఈరోజు దివ్యాంగుల కోసం అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రపంచ దేశాలన్నీ ఈ సామాజిక బాధ్యత తీసుకుని ముందుకు నడుస్తున్నాయి. వికలాంగులను వేరుగా చూడకుండా, వారు కూడా మనలో ఒకరిగా చూడాలని ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దివ్యాంగులు అంటే అంటే సమాజం చిన్న చూపు చూస్తుంది. అయితే ఆ భావన నిరాధారమైనది. సమాజంలో వీరిని అసహజం,అసమర్థులుగా…

Read More

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు

యమంచిలి:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల,ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు సాంస్కృతిగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రతిభ మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్…

Read More

వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు

యలమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలం వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మంగళవారం సిఐడి నోటీసులు అందుకున్నట్టు వెల్లడించారు. టిడ్కో ఇల్లు పంపిణీ సభ సందర్భంగా, 2022 లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నామన్నారు. అప్పటి శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రోటోకాల్ పాటించకపోవడం,తనపై దాడి చేశారని పలువురు వైసిపి నాయకులు పై కేసు పెట్టారని తెలిపారు. ఇది తనపై టిడిపి పార్టీ వారు పెట్టిన ఐదో కేసుగా ఆయన వివరించారు. వైసిపి…

Read More

యుటిఎఫ్ టెస్ట్ పేపర్ల పంపిణీ

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తో పాస్ కావాలని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి కోరారు. యుటిఎఫ్ ఉచితంగా పంపిణీ చేస్తున్న టెస్ట్ పేపర్ల వితరణ కార్యక్రమంలో భాగంగా ఏనుగులంక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వీరి సౌజన్యంతో ఇస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు…

Read More

అడవిపాలెం లో క్లీన్ అండ్ గ్రీన్

యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో, పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం మండల పరిషత్ పాఠశాల, గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. తదుపరి మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తరచూ మోసాలకు గురవుతున్న గ్రామస్తులను సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. మీ శిబిరంలో ఎన్ఎస్ఎస్ కమిటీ…

Read More

మహిళ అనుమానస్పద మృతి

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక పెంకుళ్ళపాడు సమీపంలో ఉన్న టిట్కో, ఎల్. అండ్ టి. కాలనీ వద్ద ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతురాలు పేరు తాడి రాధా(30) గా గుర్తించారు. ఈమె పదేళ్ళు గా భర్తకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తితో ఈమె గత ఏడేళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జంట మంగళవారం తెల్లవారుజామున గొడవ పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం…

Read More