Telugu News Power

పొన్న వాహనం పై స్వామివారి గ్రామోత్సవం.

స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా, శుక్రవారం, ఆరో రోజు రాత్రి, స్వామివారు పున వాహనంపై ఊరేగారు. ఈ వాహనం ప్రత్యేక సంతరించుకుంది, మిగతా వాహనాలన్నీ, వివిధ రూపాల్లో ఉంటే, పొన్న వాహనం మాత్రం, మహాభారత ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కృష్ణుడు, గోపికల చీరలు దొంగిలించకపోయే ఘట్టం మధ్యలో నరసింహుడు లక్ష్మీసమేతుడై, కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. పొన్న వృక్షం అంటే కల్ప వృక్షం. ఈ వృక్షంపై ఉన్న స్వామివారి దర్శించుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయని, పొన్నవాహన సేవ…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం,…

Read More

అంతర్వేది రథోత్సవం, భక్తజనుల కోలాహలం

సఖినేటిపల్లి;జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉగ్ర నరసింహ స్వరూపం గల,స్వామివారు పెళ్లి కళ సంతరించుకొని, పెళ్ళికొడుకై తరలిరాగా, లక్ష్మీదేవి అమ్మవారు, సిగ్గులొలుకుతూ, పెళ్లికూతురై వివాహ వేదిక చేరుకున్నారు. స్వామివారి కల్యాణ వేడుక బుధవారం రాత్రి గడియలు దాటి 1.56 గంటల ముహూర్తానికి గురువారం జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం చూసి భక్తులు తరించిపోయారు. మంగళసూత్ర ధారణ తదితర వివాహ క్రతువు పండితులు జరిపించారు. ఈ ఏడాది…

Read More

వార్డు అధ్యక్షులుగా అడ్డాల.

పాలకొల్లు: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక 27 వార్డు వైసిపి కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు అధ్యక్షత వహించారు పార్టీ సంస్థాగత బలోపేతం గురించి చర్చించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావడానికి వ్యూహాలు పై సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో, వైఎస్ఆర్సిపి ప్రముఖ సీనియర్ నాయకులు అడ్డాల నారయ్యను స్థానిక వార్డు అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సమావేశంలో పెదగోపురం మాజీ చైర్మన్ కోరాడ…

Read More

మావుళ్ళమ్మ ఉండి లెక్కింపు.

భీమవరం: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. సుమారు, 59,25,412 నగదు, కానుకల ద్వారా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించుకున్నారు. బంగారం 45.100గ్రాముల, వెండి 210 గ్రాములు భక్తులు హుండీలో వేశారు. వివిధ విదేశీ కరెన్సీ నోట్లు అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారు.

Read More

దాల్వా వరి పైరు పై, మొవ్వు పురుగు.

పాలకొల్లు: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత దాల్వా వరిపై మొవ్వు పురుగు ఆశించినట్టు ఏడిఏ మురళీకృష్ణ రైతులకు వెల్లడించారు. రైతు బడి కార్యక్రమంలో భాగంగా లంకలకోడేరులో రైతు క్షేత్ర పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన క్షేత్ర పర్యటనలో వరిపై మొవ్వు కుళ్ళు తెగులు ఆశించినట్టు గుర్తించారు. ఈ తెగులు నివారణకు, ఐసోసైక్లోసరాన్ అనే పురుగుమందు, ఒక మిల్లిలీటర్, ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. జింక్ లోపం నివారణకు, రెండు గ్రాముల,జింక్…

Read More

గెద్దాడ చంద్రకళ, ఏ ఎస్ ఓ కు ఎంపిక.

పాలకొల్లు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, నిర్వహించిన, గ్రూప్2 పోటీ పరీక్షలో స్థానిక, చిట్టివాని గురువుకు చెందిన గెద్దాడ చంద్రకళ విజయం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వ, సాధారణ పరిపాలన శాఖ లో సహాయ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి చంద్రకళ ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు, యలమంచిలి మండలం చించినాడ, సచివాలయంలో, డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఇంజనీరింగ్ పట్టబద్రులు. తండ్రి గెద్దాడ వెంకట సత్యనారాయణ, వ్యవసాయదారులు, తల్లి వెంకట సత్యవతి…

Read More

ఎస్బిఐ గోల్డ్ లోన్ బాధితులకు ఊరట

రాజోలు: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) రాజోలు భారతీయ స్టేట్ బ్యాంక్, గోల్డ్ లోన్ కుంభకోణం బాధితులకు నగదు ఉపశమనం కలిగిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దేవర ప్రసాద్ బుధవారం వెల్లడించారు. కుంభకోణం, ఆధారాలు సేకరించడానికి, విచారించడానికి,సిబిఐ కి సుదీర్ఘకాలం పట్టనుంది. ఈ సందర్భంగా, బ్యాంకు, గోల్డ్ లోన్ బాధితులకు, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, వారి బంగారానికి బదులు, నగదు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని బ్యాంక్ అధికారులు హామీ…

Read More

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

యలమంచిలి: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్సీపి శ్రేణులు రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. స్థానిక లక్ష్మీపాలెం గ్రామంలో బుధవారం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ, మండల అనుబంధ కమిటీల గురించి చర్చించారు. కూటమి ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను, హామీలను నిలబెట్టుకోకపోవడం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, సర్పంచ్ లు గటిగంటి మహేష్, పాలంకి శ్రీనివాస్,…

Read More

కేంద్ర మంత్రి అమిత్ షా కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.

న్యూఢిల్లీ: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం, ఉప్పాడ లో నిర్మించదలచిన గోడ నిర్మాణానికి, అనుమతి మంజూరు చేసినందుకు, కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో భాగంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర తాజా రాజకీయాల గురించి వారిరువురూ చర్చించుకున్నారు. పరిపాలనకు సంబంధించి،ముఖ్య విషయాలపై మాట్లాడారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని, నేటి రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ…

Read More