పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తత గ్రామాలైన యల్లవానిగరువు,అడవిపాలెం లో విద్యార్థులు, అధ్యాపకులు, ఇంటికో వ్యాపారవేత్త నినాదంతో ప్రచారం చేశారు. ఇది దేశ అభివృద్ధికి బలమైన ఆధారమని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం రామకృష్ణ, వి విజయలక్ష్మి, బూసి వెంకటస్వామి, ఆశాజ్యోతి, స్వర్ణలత,సచివాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.