Telugu News Power

ఘనంగా దేవాన్ష్ పుట్టినరోజు

తిరుమల: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు,నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానానికి 44 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తప్ప, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో హుషారుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం వారు ఆలయ మర్యాదలతో సత్కారం అనుకున్నారు. తాత మనవడు, తల్లి కొడుకులు స్వయంగా భక్తులకు మహా ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా లోకేష్ దేవాన్సుల ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి తన భద్రత పక్కనపెట్టి భక్తులతో మమేకమై వారితో ఫోటోలు దిగారు.

భక్తులతో మమేకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

భక్తులకు మహా ప్రసాదం వడ్డిస్తున్న ముఖ్యమంత్రి బాబు కుటుంబ సభ్యులు