Telugu News Power

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల

యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అప్పులు మిగిల్చి వెళ్లిందని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నమో చేస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. ఏళ్ళ పాటు సాగదీయకుండా, అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు 4 వేల రూపాయలకు పెంచామన్నారు. ప్రతి జనవరిలో జాబ్ కాలండర్ ఇస్తామన్న జగన్ ప్రభుత్వం, ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం 16,300 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచడానికి, ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు. నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, నక్కల దిబ్బలాంటి చోట ఇస్తే, ప్రజలు ఆ మడుగులో ఇల్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు పేదల కోసం కాక, వైసీపీ నాయకులు జేబులు నింపుకునే కార్యక్రమమని మంత్రి విమర్శించారు. నిరంతరం ప్రజల కోసమే, పని చేసే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఓటుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, సొసైటీ అధ్యక్షులు, పంజా నరసింహారావు, పెదకాపు, మాట్లాడుతూ, తల్లికి వందనం పథకంలో 15 వేల రూపాయలు అందరికీ ఇస్తారా అని హేళన చేసిన వారికి, కుటుంబంలో 8 మంది ఉన్న వారికి కూడా ఇచ్చి చూపించారని, ఆవేశంగా ప్రసింగించారు. ఈ కార్యక్రమంలో, ఏనుగువానిలంక నుంచి బాడవ రోడ్డుకు 50 లక్షల రూపాయలు, పాలకొల్లు నుంచి కాజ రోడ్డుకు 70 లక్షల రూపాయలు, కాజ నుంచి కలగంపూడి రోడ్డుకు కోటిన్నర రూపాయలు కేటాయించిన, పనులకు, శుక్రవారం, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కాపర్థి తో మంత్రి శంకుస్థాపన చేయించారు. ఈ కార్యక్రమంలో, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయ భాస్కర్, సొసైటీ అధ్యక్షులు, బొప్పన హరికిషోర్, బత్తుల రాజు, టిడిపి మండల అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు,కాజ పడమర మాజీ సర్పంచ్, నీటి సంఘం అధ్యక్షులు, అధికార ప్రతినిధి, మాతరత్నం రాజు, మాజీ సర్పంచ్ సత్తనీడి రాజా, మాజీ ఎంపిటిసి కొప్పినీడి సర్వేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు పీతల శ్రీనివాస్, రుద్రరాజు సత్యనారాయణ రాజు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షులు, చిట్టూరి ఆంజనేయులు, సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు కడలి గోపాలరావు, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి బోనం నాని, జనసేన నాయకులు కొడవటి వరబాబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, బిజెపి నాయకులు, వీరాజీ, చంటి స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచి మండలంలో అడుగడుగునా మంత్రికి మహిళలు ఘన స్వాగతం పలికారు

కాజ తూర్పులో జరిగిన శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు