
పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారు ఝాము నుంచి భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని వివిధ ప్రాంతాలలో అభిషేకాలు నిర్వహించారు. గోశాలలో కార్తీకదీపసమర్పణ చేశారు. కలువలు, మర్రి ,ఉసిరి వంటి శివునికి ప్రీతిపాత్రమైనవి భక్తులు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు ,వారి ధర్మకర్తలు ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వారి సిబ్బంది, చాంబర్స్ కాలేజీ విద్యార్థులు, పోలీసులు ఈ రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.