Skip to main content

Telugu News Power

సర్పంచ్ ల వాకౌట్, ఛాంబర్ అధ్యక్షునీ రాజీనామా.

 

 

మండల పరిషత్ అభివృద్ధి ఇన్చార్జ్, అధికారి జెడి ప్రసాద్ తమున అవమానించారంటూ సర్పంచులు చాంబర్ అధ్యక్షులు నిరసన తెలిపారు. మండల పరిషత్ నిధులు కోటిన్నర రూపాయలు వివిధ గ్రామాలకు పంచే విషయంలో ఎంపీడీవోని సంప్రదించగా మీకు చెప్పవలసిన అవసరం లేదని, అవమానించారన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చేసిన వ్యాఖ్యలు మొత్తం సర్పంచ్ల అందరిని అవమానించినట్టేనని, కనుక తాను చాంబర్ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తున్నట్టు పెనుమూరు సర్పంచ్ కౌరు గోపి ప్రకటించారు. వీరితోపాటు కాజ సర్పంచ్ పాలంకి శ్రీనివాసరావు, దంగేటి రాజమణి, వల్లభు నరసింహారావు తదితర సర్పంచ్ లు వాక్ఔట్ చేశారు.
ఈ విషయమై ఇన్చార్జి ఎంపిడిఓ వివరణ ఇస్తూ,నిధుల పంపిణీ తన పరిధిలో లేదన్నారు. అందువల్ల ఈ విషయంలో నిర్ణయం చెప్పలేనన్నారు.