భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనాలు పూజలు నిర్వహించినారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధరకర్తలు రామాయణం శ్రీనివాస్,గుసిడి నాగశిరీష,గొంతిన రమణ,యండ సత్యవతి,మిర్తిపాటి గుణేశ్వరరావు,పాపొలు ఏడుకొండలు ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం, అందచేసారు.
\
అమ్మవారికి బంగారు కానుక సమర్పించుకొన్న తాడి రమేష్ కుమార్, కరిష్మా దంపతులు