Skip to main content

Telugu News Power

ఓడ నిండా గ్యాస్ వస్తుంది, కొరత లేదు. -పౌరసరఫారాల మంత్రి మనోహర్

అమరావతి: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్ కాం) గ్యాస్ సరఫరా పై వస్తున్న అపోహలు నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.
మంత్రి కీలక వివరాలు శుక్రవారం వెల్లడించారు.
ఇప్పటివరకు 2.96 లక్షల బుకింగ్స్ గాను 2.78 లక్షల సిలిండర్లు అందజేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా అపోహలు సృష్టించడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ఎగబడుతున్నారన్నారు. ఈనెల
26న విశాఖకు ఎల్పిజి గ్యాస్ నౌక చేరుకుంటుందని, ఇందువల్లసరఫరా మరింత మెరుగవుతుందన్నారు.
గృహ అవసరాలకు, ఆసుపత్రులు, విద్యాసంస్థలకుప్రాధాన్యత ఇచ్చి నిరంతర సరఫరా చేస్తామన్నారు.
గ్యాస్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 9 ఏజెన్సీలు ప్రస్తుతానికి రద్దు చేశామన్నారు. ఓటిపి
ద్వారానే గ్యాస్ డెలివరీ ఇస్తామన్నారు.
పట్టణాల్లో పిఎన్జి గ్యాస్ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయంగా,ఇండక్షన్ స్టవ్‌లు, అంగన్వాడీలకు
కిరోసిన్ సరఫరాకు ప్రభుత్వం రంగ సిద్ధం చేసిందన్నారు.
ప్రజలు అపోహలు నమ్మకుండా, అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వంటగ్యాస్ సరఫరాపైవివరిస్తున్న మంత్రి మనోహర్