2025
ఐచ్ఛిక సెలవులు (Optional Holidays – 2026)
క్రమ సంఖ్య పండుగ / సందర్భం తేదీ రోజు 1 నూతన సంవత్సర దినోత్సవం 01-01-2026 గురువారం 2 హజ్రత్ అలీ జన్మదినం 03-01-2026 శనివారం 3 షాబ్-ఇ-మెరాజ్ 16-01-2026 శుక్రవారం 4 షాబ్-ఇ-బరాత్ 03-02-2026 మంగళవారం 5 హజ్రత్ అలీ షహాదత్ 11-03-2026 బుధవారం 6 జుమాతుల్-విదా 13-03-2026 శుక్రవారం 7 షాబ్-ఏ-కదర్ 15-03-2026 ఆదివారం 8 మహావీర్ జయంతి 31-03-2026 మంగళవారం 9 బసవ జయంతి 20-04-2026 సోమవారం 10 బుద్ధ పౌర్ణమి 01-05-2026…
ఆంధ్రప్రదేశ్ – 2026 ప్రభుత్వ సాధారణ సెలవులు
క్రమ సంఖ్య పండుగ / సందర్భం తేదీ రోజు 1 భోగి 14-01-2026 బుధవారం 2 మకర సంక్రాంతి 15-01-2026 గురువారం 3 కనుమ 16-01-2026 శుక్రవారం 4 గణతంత్ర దినోత్సవం 26-01-2026 సోమవారం 5 మహా శివరాత్రి 15-02-2026 ఆదివారం 6 హోలీ 03-03-2026 మంగళవారం 7 ఉగాది 19-03-2026 గురువారం 8 రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) 20-03-2026 శుక్రవారం 9 శ్రీ రామనవమి 27-03-2026 శుక్రవారం 10 గుడ్ ఫ్రైడే 03-04-2026 శుక్రవారం 11 బాబు…
ఉత్తమ ఫలితాలకు 10వ తరగతి యాక్షన్ ప్లాన్
పాలకొల్లు డిసెంబర్ 11 తెలుగు న్యూస్ పవర్ పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి పదో తరగతి యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని రీజినల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చించడానికి ఆర్జెడి నాగమణి పాలకొల్లు సందర్శించారు. స్థానిక బి.ఆర్. ఎం.వి పాఠశాలలో గురువారం జరిగిన సమావేశం లో ఆర్జేడి నాగమణి ఇప్పటివరకు జరిగిన పదవ తరగతి విద్యార్థుల వందరోజుల యాక్షన్ ప్లాన్…
మహిళల అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి.
పాలకొల్లు:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) మనుషుల అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుందని పాలకొల్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ,ప్రతిరోజు ఎంతోమంది యువతులు, మహిళలు మానవ రవాణాకు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం,సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని నేరస్తులు పన్నే ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. వారి వలలో చిక్కుకున్న వారిని…
హనుమద్ వ్రత రథోత్సవం
యలమంచిలి:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి హనుమద్ వ్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రాత్రి రథోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలు ఈనెల 3 నుంచి 11 వరకు తొమ్మిది రోజులు పాటు జరిగాయి. గంధం గంగాధర్, నాగమణి దంపతుల చే ఈ పూజలు ప్రారంభించారు. స్వామి వారికి పంచామృత అభిషేకం, తమలపాత్ర పూజ వంటి పూజలు జరిపారు. రథోత్సవం కోలాటం భజన, నృత్యబృందాలతో ఘనంగా జరిగింది. ఈ పూజా…
ఉద్యోగుల హెల్త్ కార్డ్ లపై అధికారిక కమిటీ.
అమరావతి:డిసెంబర్,11(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ కార్డు సంబంధించి అధికారిక కమిటీని గురువారం సాయంత్రం,ప్రకటించింది. ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఇచ్చిన హామీ మేరకు ఈ కమిటీ ఏర్పాటు అయింది. కమిటీలో ఏడుగురు సభ్యులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ (ఎక్స్పెండిచర్ అండ్ హెచ్ఆర్), కార్యదర్శి(ఆరోగ్య, కుటుంబ సంక్షేమ), ఏపీ ఎన్జీవో నాయకులు విద్యాసాగర్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్…
పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకం
పాలకొల్లు:డిసెంబర్,11( తెలుగు న్యూస్ పవర్) పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర,స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం, కంపోస్ట్ తయారీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్, రామకృష్ణ, వి విజయలక్ష్మి, కోఆర్డినేటర్ వి యామిని, తెలుగు శాఖ…
పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలి – వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి డిమాండ్.
పాలకొల్లు:డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడును వైఎస్ఆర్సిపి,పాలకొల్లు ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి,, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల తరలింపు ర్యాలీ పాలకొల్లు నుంచి భీమవరం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గుడాల గోపి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో…
అంతర్వేది లో సుదర్శన నరసింహ హోమం
సఖినేటిపల్లి: డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ప్రసిద్ధ అంతర్వేది నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సుదర్శన నరసింహ హోమం జరిగింది. ఈ హోమం చేయించుకుంటే,స్వామి వారి కంటే వేగంగా భక్తులను చేరుకునే సుదర్శన చక్రం, సకల ఈతి బాధలకు విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల యొక్క సత్ప్రవర్తనకు, ప్రశాంతతకు ఈ హోమం దోహదపడుతుందని పండితులు తెలిపారు. స్వామివారి ఆలయం చుట్టూ 9 సార్లు,9 వారములు ప్రదక్షిణలు చేసిన…