Telugu News Power

లయన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గా ముత్యాల రామారావు.

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణాజిల్లా లయన్స్ 316డి, జిల్లా, “లయన్ ఆఫ్ ద డిస్టిక్” అవార్డుకు, పాలకొల్లుకు చెందిన సీనియర్ పాత్రికేయులు ముత్యాల రామారావు ఎన్నికయ్యారు. ఈ అవార్డు 2024- 25 కు గాను విజయవాడలో ఆదివారం జరిగిన బహుమతి ప్రధానోత్సవం సభలో జిల్లా గవర్నర్,గద్దె శేషగిరిరావు అందజేశారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా వీరిని వరించింది. జిల్లా గవర్నర్ లయన్ వివిపిఎస్ ఆంజనేయులు సమక్షంలో, ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్, పి సుభాష్ బాబు ఈ…

Read More

యలమంచిలి ముద్దుబిడ్డ చిలుకూరి నితిన్ 32 లక్షల ప్యాకేజ్.

యలమంచిలి:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి తెలుగుదేశం నాయకులు, చిలుకూరి వెంకట రాఘవేంద్ర కుమార్, వారి పెద్ద కుమారుడు నితిన్ భారీ ప్యాకేజీ అందుకున్నారు. నితిన్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ముంబై ఐఐటీలో ఎంటెక్ చేస్తున్నారు. నేడు జరిగిన క్యాంపస్ సెలక్షన్లో బెంజ్ కంపెనీవారు ఈ భారీ ఆఫర్ ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాంటిసోరి అధినేత కృష్ణ వర్మ, మాజీ జెడ్పిటిసి బోనం నాని, మండల టిడిపి ఉపాధ్యక్షులు తమ్మినీడి…

Read More

కాస్మో క్లబ్ సాయం, క్యాన్సర్ బాధితునికి ఉపశమనం.

పాలకొల్లు, యలమంచిలి :డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు కాస్మో క్లబ్ యలమంచిలి మండలం, ఏనుగువానిలంక శివారు,పోలవరానికి చెందిన పోత్తూరు నరసింహారాజు నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇందువల్ల వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాస్మో క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వీరికి సహాయం చేయడానికి పూనుకున్నారు. వీరి ఆలోచన మేరక, క్లబ్ కార్యదర్శి వేగిరాజు వెంకట సోమరాజుగారు క్లబ్బు నిధుల నుంచి 20వేల రూపాయలు కేటాయించారు. క్షత్రియ పరిషత్…

Read More

పంచారామ క్షేత్రం పాలకొల్లు లో ప్రత్యేక పూజలు.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం గణపతి హోమం జరిగింది. ఈ హోమంలో 13 మంది దంపతులు పూజలు నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న భక్తులచే పూజధికాలు చేయించారు. ప్రతి సోమవారం సాయంత్రం స్వామివారి దేవాలయంలో నిర్వహిస్తున్న 7మారేడు దళముల మాడవీధుల ప్రదక్షణలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి…

Read More

11 కే పరిమితమైన జగన్ మారలేదు-మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,8(తెలుగు న్యూస్ పవర్) మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినప్పటికీ ఆయనలో ఏ మార్పు రాలేదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. తిరుపతి హుండీ పరకామణి చోరీ కేసులో నిందితులను వెనకేసుకురావడాన్ని మంత్రి ఖండించారు. జగన్ దృష్టిలో 70 వేల చోరీ చిన్న మొత్తంగా కనపడిందంటే, అది నిజమే కావచ్చు అన్నారు. లక్షల కోట్లు తిన్న జగన్ ఎవరు ఏమీ చేయలేకపోయారని, దర్జాగా బయట తిరగ్ కలుగుతున్నానని అందువల్ల పరకామని చోరీ కేసు…

Read More

50 లక్షల వంతెనల పనులకు శంకుస్థాపన

పాలకొల్లు.డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్)ప్రస్తుతం పనులు జరుగుతున్న దమ్మయ్యపర్తి డ్రైన్ ప్రాంతాన్ని మంత్రి నిశితంగా పరిశీలించారు. డ్రైన్ కు సంబంధించి ఆశాఖ ఇంజనీర్లతో పలువిషయాలు చర్చించారు. డ్రైన్ నిర్మాణంతో పాటు అవసరమైన రెండు వంతెనలు నిర్మించడానికి మంత్రి మిమ్మల్ని రామానాయుడు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఒక్కో వంతెన కు సుమారు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు.  

Read More

ఎయిడ్స్ బాధితులు పట్ల మానవత్వం చూపాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ బాధితుల పట్ల మానవత్వం చూపాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ వారి ద్వారా హెచ్ఐవి బాధితులకు సహాయం అందించిన సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం హెచ్ఐవి బాధితులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత పౌష్టికాహారం, నిత్యవసర సరుకులు, బ్యాగ్లు అందించారు. గత 20 ఏళ్లు గా తన తండ్రి…

Read More

అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలి అధికారులుకు మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు:డిసెంబర్, 7 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సమీక్ష లో టిడ్కో ఇళ్ళు,మున్సిపల్, టూరిజం,పంచాయతీరాజ్, జలవనరులు, ప్రజాఆరోగ్య శాఖలతో మంత్రి సమీక్ష సమావేశం లో దిశా నిర్దేశం చేశారు. పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పనులు విషయంలో ముందు వరుసలో…

Read More

జక్కంపూడి కి పితృవియోగం

పాలకొల్లు: డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్)సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్, డి ఆర్ యు సి సి సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు జక్కంపూడి కుమార్ తండ్రి నరసింహారావు ఆదివారం కీర్తిశేషులు అయ్యారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తిగతంగా, ఫోన్ ద్వారా కుమార్ సంతాపం తెలియజేశారు.

Read More

రోటరీ క్లబ్ ఇమేజ్ సెమినార్

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ 3020 ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు, అందులో రోటరీ సభ్యుల యొక్క పాత్ర అనే అంశంపై ఆదివారం,రామచంద్ర గార్డెన్స్ లో సెమినార్ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోటరీ జోన్7, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్, ముఖ్య అతిధి,రోటరేరియన్ అభినందన్ ఈ అంశంపై సభ్యులకు అనుసరించవలసిన వివిధ వ్యూహాల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా మరియు…

Read More