Telugu News Power

వచ్చేనెల 13 నుంచి పాలకొల్లు కళా పరిషత్.

పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) వచ్చేనెల 13 నుంచి 15వ వరకు పాలకొల్లు కళాపరిషత్ నిర్వహించనున్న నాటిక పోటీలకు సంబంధించి, ఆహ్వాన పత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. పాలకొల్లు పట్టణంలో గత 75 సంవత్సరాలుగా, నిర్వహిస్తున్న నాటక పోటీలు, తాము కూడా ప్రోత్సహించాలని ఉద్దేశంతో, పాలకొల్లు కళాపరిషత్ తరపున గత 17 ఏళ్లుగా నాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కె.వి కృష్ణ వర్మ తెలిపారు. అడబాల థియేటర్ వద్ద నాటికలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు…

Read More

త్రాగునీటి కొరత లేకుండా చూడాలి. -కలెక్టర్ ఆదేశాలు

త్రాగునీటి కొరత లేకుండా చూడాలి. -కలెక్టర్ ఆదేశాలు భీమవరం: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) వచ్చే వేసవి నాటికి త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆదేశాలు ఇచ్చారు. స్థానిక వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం మునిసిపల్ శాఖ అధికారులతో కలెక్టర్, నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. త్రాగునీటి నాణ్యత పై…

Read More

ఛాంబర్స్ కళాశాల జాబ్ మేళాలో, 154 మంది ఎంపిక.

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో వికాస కాకినాడ కలెక్టరేట్ వారి సహకారం తో జాబ్ మేళాను శుక్రవారం నిర్వహించారు. అభ్యర్థులు 258 మంది హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. వీరస్వామి మాట్లాడుతూ, విద్యార్థి దశలోని క్రమశిక్షణ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని నేడు ప్రతి ఉద్యోగానికి సాంకేతిక నైపుణ్యం మరియు చురుకుదనం చాలా అవసరం అని…

Read More

సాగునీటి సరఫరా సక్రమంగా సాగాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు

భీమవరం: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) జిల్లాలో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా కాలువల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో సాగునీటి డ్రైన్లు, షట్టర్లు, కాలవగట్లు, తూడు తొలగింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు. మంజూరు కాని పనులకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని, టెండర్లు ప్రక్రియ ముందుగానే పూర్తి చేయాలన్నారు. కాలవలు నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పశ్చిమ…

Read More

జగన్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు, వైసిపి కాపు నాయకులు ఏమయ్యారు? -విప్ బొలిశెట్టి ప్రశ్న.

అమరావతి: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు, ఈ కాపు నాయకులంతా ఏమయ్యారని, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ అమలు కోసం వినతి పత్రం అందజేయటానికి, భారతీయ కాపు సేన అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పలువురు ప్రతినిధులు బొలిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి విషయానికి, కాపు నాయకులు పవన్ కళ్యాణ్…

Read More

క్షీరారామం లో శ్రీ బాణ లింగ ప్రతిష్ట ‌

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, శుక్రవారం శ్రీ బాణ లింగ ప్రతిష్టాపన శ్రీ సుంగేశ్వరి పీఠాధిపతి ఆదేశముల మేరకు జరిగింది. అమరావతిలో ఉన్న, అమరలింగేశ్వర స్వామి వారి రక్షణ కొరకు, ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న ద్రాక్షారామ లింగేశ్వరుడు సంరక్షించుటకుగాను శ్రీ బాణ లింగ ప్రతిష్ట జరిగినది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా స్వామివారి సంరక్షణార్థం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుర…

Read More

డ్రోన్,భూసార పరీక్షల శిక్షణా కార్యక్రమం ముగింపు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా బాలికలకు నిర్వహించిన 5 రోజుల ఏరియల్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కార్యక్రమం ఐదవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమం ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా, ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై…

Read More

వైసిపి పార్టీలో ఆటో డ్రైవర్ల చేరిక.

పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జి గుడాల హరి గోపాల్ రావు,గోపి స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 18 మంది తటస్తులు ఈరోజు పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్, మాజీ ఫ్లోర్ లీడర్, వైసీపీ సీనియర్ నాయకులు యడ్ల తాతాజీ, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర…

Read More

కాలేజీ కలప అమ్మకం

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న కలప అమ్మాలని, యాజమాన్యం నిర్ణయించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈనెల 20న కొటేషన్లు షీల్డ్ కవర్లో కళాశాలలో అందజేయాలని ప్రిన్సిపల్ టీ రాజరాజేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.

Read More

ఛాంబర్స్ కళాశాలలో “స్థానికపాలన-ఆధునికపోకడలు” పై సదస్సు.

పాలకొల్లు: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో, గురువారం, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాద్ వారి సౌజన్యంతో “స్థానిక పాలనలో ఆధునిక పోకడలు” అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టంగుటూరి శ్రీరామ్, వేమూరి ఆనంద సూర్య, ఛాంబర్స్ కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా టంగుటూరి శ్రీరామ్ మాట్లాడు, ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థలలో సుపరిపాలన, ఈ…

Read More