Telugu News Power

పాలకొల్లు వాకర్స్ క్లబ్ కు మూడు అవార్డులు

పాలకొల్లు: నవంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు వాకర్స్ క్లబ్ జిల్లాస్థాయిలో మూడుఅవార్డులు సొంతం చేసుకుంది. క్లబ్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రెటరీ అవార్డులు, సొంతం చేసుకున్నారు.. భీమవరం కాస్మో క్లబ్ లో ఆదివారం జరిగిన వాకర్స్ జిల్లా 201 కాన్ఫరెన్స్ లో ఈ పురస్కారాలు అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి,డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు…

Read More

క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం లెక్కింపు.

పాలకొల్లు:నవంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ మొత్తం 32,64,772 రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. భీమవరం డివిజన్ దేవదాయ శాఖ అధికారి వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డ్ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర తదితర ధర్మకర్తలు, సూపరిండెంట్ వాసు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు,…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More

అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ తరలింపు

పాలకొల్లు: నవంబర్ ,28 (తెలుగు న్యూస్ పవర్) ఇటీవల పూలపల్లి బైపాస్ రోడ్ లో ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని వేరేచోటకు మార్చారు. ఇక్కడ భవనం విశాలంగా లేకపోవడం వల్ల, ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ప్రదేశాన్ని మార్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కు చెందిన, పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో గల విశాల భవనంలోకి శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి, నూతన భవనంలోకి గృహప్రవేశం చేశారు….

Read More

మూలస్థానేశ్వరి అమ్మవారికి భారీ బంగారు ఆభరణాల సమర్పణ

యలమంచిలి నవంబర్ 28 తెలుగు న్యూస్ పవర్ మండల కేంద్రమైన యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం బంగారు ఆభరణాలు సమర్పించారు. యలమంచిలి వాస్తవ్యులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి శిరీష దంపతులు ఈ కానుకలు అందజేశారు. ఈ దంపతుల కోర్కెలు ఈడేర్చినందుకుగాను, అమ్మవారికి భక్తితో ఈ భారీ కానుకలు బహుమతిగా అందజేశారు. అమ్మవారికి నల్లపూసల రూపంలో 24 గ్రాముల బంగారంతో చేయించారు. ఈ ఆభరణం విలువ దాదాపు…

Read More

శివదేవుని చిక్కాల లో వైభవంగా ఆలయ సంప్రోక్షణ.

పాలకొల్లు: నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మండలం ,శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం, ఆలయ సంప్రోక్షణ మహోత్సవం మూడు రోజులపాటు శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవారం గోపూజ గ్రామ సంరక్షణ గావించారు. బుధవారం విశ్వక్సేన ఆరాధన మూల మంత్ర హోమం అంటి పూజలు నిర్వహించారు. గురువారం ఆలయం మరియు ధ్వజస్తంభం శిఖరాలకు కుంభ సంప్రోక్షణ జరిగింది. తదనంతరం విశ్వరూప దర్శనం ప్రథమ దర్శనం అర్చన కార్యక్రమాలు…

Read More

అడవిపాలెం ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే

యలమంచిలి:నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించాలని ప్రిన్సిపల్ డాక్టర్ టీ. రాజరాజేశ్వరి వాలంటీర్లకు సూచించారు. నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు ఏఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో అడవి పాలెం గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ అడవి పాలెం గ్రామాన్ని ఎన్ఎస్ఎస్ దత్తత తీసుకున్నట్టు…

Read More

సుబ్రహ్మణ్యం షష్టికి తరలి వచ్చిన భక్తజనం

పాండు ఎలమంచిలి నవంబర్ 26 తెలుగు న్యూస్ పేపర్ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాల్లో భాగంగా తెలుగు భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు, దొడ్డిపట్ల, యలమంచిలి, అడవిపాలెం దేవాలయాల భక్తులు ఉదయం నుంచి తరలివచ్చారు. పాలకొల్లు దాదాపు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా చిరు వ్యాపారం ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్ద ఈ పండుకు ముఖ్యమైన జీల్లు,ఖర్జూరాలతో పాటు పిల్లల ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా…

Read More

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక

పాలకొల్లు: నవంబర్,26 (తెలుగు న్యూస్ పవర్)భారత రాజ్యాంగ 75 దినోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక లజపతిరాయ్ పేట లో గల అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించారు. స్థానిక మాంటిసోరి పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విద్యాసంస్థల అధినేత కలిదిండి కృష్ణ వర్మ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ రచన పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు…

Read More

స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం.

పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ…

Read More