Skip to main content

Telugu News Power

దీపోత్సవం- భక్తి పారవశ్యం

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం తుది సోమవారం రాత్రి పాలకొల్లులో, కాంగ్రెస్ నాయకులు కరిమేరక బాల నాగేశ్వరరావు స్థలంలో ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి, ఇర్రింకి దుర్గా హరిహర సాయి పవన్, శ్రీజ పుణ్యదంపతులు, తదితర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైదిక ఘనపాటీలు దీపోత్స పూజలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా…

Read More

విప్లవ వీరుడు ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ.

భారతీయుల ధైర్య సాహసాలను ఆదిలోనే రుచి చూపిన విప్లవ వీరుడు, తెల్ల వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన విప్లవ జ్యోతి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ఘనంగా ఆదివారం జరిగింది. మార్టేరు కూడలి దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్రరోడ్లు భవనాల శాఖమంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు తరలి వచ్చారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ…

Read More

కార్తీక వన సమారాధనలతో హోరెత్తిన పాలకొల్లు

కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం పాలకొల్లు పట్టణాన్ని హోరెత్తించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో వివిధ సంఘాలవారు ఒకేరోజు ఈ కార్యక్రమాన్ని జరపడంతో పట్టణం సందడిగా మారింది.ఎక్కడ చూసినా ఆయా సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా వనభోజనాలకు తరలి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వారికి ఏర్పాటు చేసిన ఆటల్లో కేరింతలు కొడుతూ ఆనంద పడ్డారు. కొన్నిచోట్ల శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆడవారికి హౌసీ లక్కీ డిప్…

Read More

నేడే 21వ పాలకొల్లు కాపు వనభోజన సమారాధన

పాలకొల్లు, నవంబర్,16(తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో 21వ కాపు వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్టు కాపు ప్రముఖులు వంగా నరసింహారావు తెలిపారు. పాలకొల్లు బైపాస్ రోడ్ లోని ఎస్కన్వెన్షన్ ఎదురుగా ఉన్న స్థలంలో వనభోజనాలు జరుగుతాయి అన్నారు. దాదాపు 15 వేలమంది ప్రతి ఏట ఈ వనభోజనాలకు హాజరవుతారు అన్నారు. మహిళలకు పిల్లలకు యువకులకు దాదాపు పది రకాల ఈవెంట్స్ ఈ కార్యక్రమంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అందరు కాపు ప్రముఖుల తో…

Read More

నేడే స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ విగ్రహఆవిష్కరణ

భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవాగ్ని రగిలించిన తొట్టతొలి యోధుడు, భరతజాతి ముద్దు బిడ్డ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తలతెగిపడినా, మొండెం ఆధారంగా యుద్ధం చేసిన మహావీరుడు, సమరసింహం ఈ నరసింహారెడ్డి. త్యాగాల ఉయ్యాల స్పూర్తి,భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఓ మహాధ్యాయం. వీరి జీవితచరిత్ర మూలంతో, సైరా నరసింహా రెడ్డి పాత్ర చిరంజీవి నటించి చలన చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. ఈ విప్లవవీరుల విగ్రహాన్ని పెనుమంట్ర మండలం, మార్టేరు కూడలి వద్ద నేడు ఆదివారం…

Read More

విష్ణాలయంలో కార్తీక వన సమారాధన

యలమంచిలి, నవంబర్ 14 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉసిరివనంలో కార్తీక వన సమారాధన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయంలో విశేష పూజలు చేశారు.పలువురు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిలుకూరి ఆంజనేయులు వారి ధర్మకర్తలు అర్చకులు వాడపల్లి గోపి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు.  

Read More

యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ

మండల కేంద్రంమైన యలమంచిలి శివాలయంలో లక్ష ప్రతిపూజ భక్తిశ్రద్ధలతో బుధవారం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్,అడబాల శ్రీమన్నారాయణ వారి ధర్మకర్తలు జోషి, రామదాసు, నాగేశ్వరరావు రవికుమార్, దుర్గారావు, శ్రీనివాస్, లక్ష్మీ, దుర్గ, నాగలక్ష్మి, పాల్గొన్నారు.ఆలయ అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్,సుబ్రమణ్యం, ఋత్విక్కులు , పూజాదికాలు జరిపించారు. పలువురు భక్తులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన చిన్న, టీడీపీ నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, కొడవటి వరబాబు, కాస నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు. యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు…

Read More

పాలకొల్లు కు ఫిలిం ఇన్స్టిట్యూట్ #news #cinema #telugu #Palakollu

కళలకు పుట్టిల్లు పాలకొల్లు. పాలకొల్లు. కళాకారుల చిరకాల వాంఛ త్వరలోనే సాకారం కాబోతుంది. కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఏర్పాటు చేయబోయే ఫిలిం ఇన్స్టిట్యూట్ విశేషాలను వివరించారు. ఈ ఇన్స్టిట్యూట్ కు అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిలిం ఇన్స్టిట్యూట్ గా నామకరణం చేశారు. తొలి కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యనిర్వాహక కమిటీలో గౌరవ సలహాదారుగా…

Read More