Telugu News Power

అంతర్జాతీయ కార్యదర్శిగా ‘ దర్శి’

పాలకొల్లు: డిసెంబర్, 22 (తెలుగు న్యూస్ పవర్) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నూతన కార్యదర్శిగా పాలకొల్లు వ్యాపారవేత్త దరిశి శ్రీనివాస గుప్త నియమితులయ్యారు. హైదరాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో ఆదివారం ఈ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. గుప్త అదే రో జు జరిగిన, ప్రమాణస్వీకారోత్సవంలో బాధ్యతలు స్వీకరించారు. కొత్త ఏడాది నుంచి వీరి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1500 వాసవి క్లబ్ లు ఉన్నాయి. ఈ క్లబ్బుల్లో 80 వేల వరకు సభ్యులు…

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది. స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద…

Read More

చాంబర్స్ లో క్రిస్మస్ సంబరాలు

పాలకొల్లు; డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాలతో జరిగాయి. విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. శాంతా క్లాస్ మధ్య మధ్యలో చాక్లెట్ బహుమతులు విసిరారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఏడాది చక్కని ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలను కొనియాడారు. పరమత సహనం పాటించాలన్నారు. కళాశాల కార్యదర్శి సీతారామరాజు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, డాక్టర్ మూర్తి, జానకి రామయ్య,…

Read More

డివిజన్ స్థాయి త్రో బాల్ పోటీల్లో యలమంచిలి విజేత

యలమంచిలి డిసెంబర్ 18 (తెలుగు న్యూస్ పవర్) డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. నరసాపురం,మొగల్తూరు పోడూరు,యలమంచిలి పాలకొల్లు మండలాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. యలమంచిలి మండలంలో గురువారం ఈ పోటీలు జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడపాడు లో మహిళ క్రీడాకారుల త్రో బాల్ పోటీలు జరిగాయి. స్థానిక ఎంపీటీసీ సభ్యులు డేగల సూర్యకుమారి మాజీ సర్పంచ్ అడ్డాల వాసుదేవరావు క్రీడాపోటీలు ప్రారంభించారు. ఐదు మండలాల మహిళ క్రీడాకారులు పాల్గొన్న త్రోబాల్ పోటీల్లో…

Read More

అద్భుత జ్ఞాపకం, ఏ ఎస్ ఎన్ ఎం అమేజింగ్ రీయూనియన్

  భీమవరం:డిసెంబర్,13 (తెలుగు న్యూస్ పవర్) పలకరింపులు, కౌగిలింతలు, నవ్వులు, కేరింతలు, తుళ్ళింతలతో ఉప్పొంగిన ఆత్మీయ హృదయ సమ్మేళన అపురూప దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల కలయిక.భీమవరం(జక్కరం)లోని ఓ ఫామ్ హౌస్ లో శనివారం జరిగిన సందర్భంగా ఈ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఈ కాలేజీలో 1979 నుంచి 1982 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ జ్ఞాపకాలు ఇక్కడ పంచుకున్నారు. బిజీ లైఫ్ నుంచి బ్రేక్ ఇచ్చి,…

Read More

మహిళల అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పాలకొల్లు:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) మనుషుల అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుందని పాలకొల్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ,ప్రతిరోజు ఎంతోమంది యువతులు, మహిళలు మానవ రవాణాకు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం,సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని నేరస్తులు పన్నే ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. వారి వలలో చిక్కుకున్న వారిని…

Read More

మానవ హక్కులను గౌరవించాలి

పాలకొల్లు డిసెంబర్ 10 తెలుగు న్యూస్ పవర్ ప్రతి ఒక్కరు మానవ హక్కులను గౌరవించాలని న్యాయవాది రాజా శ్యామల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం స్థానిక ఏ సంఘం గవర్నమెంట్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యు ఎన్ ఓ) డిక్లరేషన్ ద్వారా లభించిన మానవ హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. ఇది అందరి బాధ్యతని తెలిపారు. ఇదే సందర్భంలో పౌరులు తమ బాధ్యతలను కూడా గుర్తు ఎరగాలని విజ్ఞప్తి…

Read More

పాలకొల్లు దుఃఖదాయని దమ్మయపర్తి మురుగు నుంచి విముక్తి.

పాలకొల్లు:డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) దమ్మయ్యపర్తి కోడు పాలకొల్లు మునిసిపాలిటీ అంత పురాతనమైనది. హిందూపురాణాలలో, ముఖ్యంగా,గరుడ పురాణంలో చెప్పబడిన వైతరణీ నది లాంటిది. ఆ నది యమలోకానికి,భూమి మరియు నరకం మధ్య ప్రవహించే భయంకరమైన నదిగా చెప్పబడింది. పాపులు చనిపోయిన తర్వాత ఈ నదిని దాటవలసి వస్తుంది. ఇక్కడ రక్తం, మలం, కుళ్ళు, మూత్రం వంటి దుర్గంద ద్రవాలతో నిండి ఉంటుంది. పాపులను ముళ్ళు,చేపలతో బాధపెడుతూ ఈ నదిని దాటిస్తారు అని నమ్మకం. అయితే దమ్మయ్యపర్తికోడు వైతరణి…

Read More

క్షీరా రామలింగేశ్వర ఆలయంలో విఘ్నేశ్వర పూజ.

పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పవర్ వారం వారం జరుగుతున్న సప్త మారేడు దళముల ప్రదక్షణలు పూర్తి చేసుకున్న 15 మంది భక్త దంపతులు విగ్నేశ్వర పూజలో పాల్గొన్నారు. శివ సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు పి వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Read More