Telugu News Power

రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్,…

Read More

అంబటి అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజంలో నిలబడే అర్హత కూడా లేదని, స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. స్థానిక కాజ పడమర గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో దిగమర్రు వరకు వేయనున్న రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై…

Read More

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

యలమంచిలి: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్సీపి శ్రేణులు రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. స్థానిక లక్ష్మీపాలెం గ్రామంలో బుధవారం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీ, మండల అనుబంధ కమిటీల గురించి చర్చించారు. కూటమి ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను, హామీలను నిలబెట్టుకోకపోవడం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని నిర్ణయించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, సర్పంచ్ లు గటిగంటి మహేష్, పాలంకి శ్రీనివాస్,…

Read More

కేంద్ర మంత్రి అమిత్ షా కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు.

న్యూఢిల్లీ: జనవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం, ఉప్పాడ లో నిర్మించదలచిన గోడ నిర్మాణానికి, అనుమతి మంజూరు చేసినందుకు, కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో భాగంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర తాజా రాజకీయాల గురించి వారిరువురూ చర్చించుకున్నారు. పరిపాలనకు సంబంధించి،ముఖ్య విషయాలపై మాట్లాడారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని, నేటి రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ…

Read More

ఎన్టీఆర్ ఓ చరిత్ర – మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ అంటే ఓ చరిత్రని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అనేంత మార్పు తీసుకువచ్చిన మహనీయుడని జోహార్లు అర్పించారు. తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచం నలుమూలల ఎన్టీఆర్ వల్ల విస్తరించిదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు…

Read More

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: డిసెంబర్, 31 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో, ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకల ఆడంబరాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అందుకు ప్రతిగా, అంబేద్కర్ విగ్రహాల పై నిర్మాణాలు పూర్తి చేయడానికి, ధన రూపంలో గాని, శ్రమదాన రూపంలోగాని ఇవ్వాలని, తన ఆలోచనగా తెలిపారు. గ్రామంలో నిరుపేద ఇంటి నిర్మాణానికి సహాయం…

Read More

భారతీయులు స్నేహపాత్రులు

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) భారతీయులు స్నేహపాత్రులని స్పెయిన్ యాత్రికులు కార్లోస్ ప్రశంసించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య నివాసంలో, ఆదివారం రాత్రి మాట్లాడారు. ఇక్కడ ప్రజలు విదేశీయుల పట్ల ఆసక్తి, గౌరవం చూపుతారని గమనించానన్నారు. వారిలో ఓపిక సహనం వంటి సుగుణాలు తనను ఆకర్షించాయన్నారు. కార్లోస్ (29) ప్రస్తుతం భారత యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర గత నెల 24న స్పెయిన్ లో ప్రారంభించారు. ఢిల్లీలో ఒక మోటార్ బైక్ అద్దెకు తీసుకుని…

Read More

రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ – మంత్రి నిమ్మల ఆరోపణ

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పేపర్) రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ల మారారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. స్థానిక వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి, సుందరీకరణ పనులకు శుక్రవారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకుగాను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కోటిన్నర రూపాయలు మంజూరు చేయించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమాల్లో ప్రతినాయకుడు పాత్రలాగే, జగన్ కథ కూడా త్వరలోనే ముగుస్తుందని తెలిపారు….

Read More

పాలకొల్లు టిడిపికి జిల్లా పదవులు

పాలకొల్లు:డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు బందెల భాస్కరరావుకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పదవి లభించింది. మరో సీనియర్ టీడీపీ నాయకులు వల్లూరి ధనుంజయ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవి అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వర రావు, పాముల రజిని కుమార్, పెచ్చటి బాబు తదితరులు అభినందన తెలిపారు.

Read More

తెలుగుదేశం,వైసిపి పార్టీల మధ్య మాటల యుద్ధం.

పాలకొల్లు:డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గంలో బలమైన రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాలరావు,గోపి చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం రాజుకుంది. వెంటనే తెలుగుదేశం నాయకులు ప్రతిదాడికి దిగారు. సూపర్ సిక్స్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని టిడిపి నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ, పోలీస్ నియామకాలు జరిపామన్నారు. అభివృద్ధి పనులు…

Read More