Telugu News Power

మూలస్థానేశ్వరి అమ్మవారి అఖండ అన్న సమారాధన.

యలమంచిలి: మార్చ్,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూవస్థానేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అఖండ అన్నసమారాధన జరిగింది. వేలాది మంది భక్తులు మహా ప్రసాదం స్వీకరించడానికి, పరిసర గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. నిర్వాహకులు 15 వేల మంది వరకు వస్తారని అంచనా వేసారు. మాంసాహార, శాఖాహార మహా ప్రసాదం వడ్డించారు. దాదాపు వెయ్యి కేజీల మటన్, 800 కేజీల చికెన్ తో వంటకాలు సిద్ధం చేశారు. భారీగా జరిగిన ఈ…

Read More

శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం.

పాలకొల్లు:ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనుకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు నాగబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పురవీధులలో ఏనుగు అంబారిపై అమ్మవారు ఊరేగారు. పూలచత్రాలు ఇరువైపులా బారులు తీరగా, గరగ నృత్యాలు, బేతాళ నృత్యాలు, మ్యూజికల్ బ్యాండ్ బృందాలను అనుసరించి రథోత్సవం సాగింది. భక్తులు శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహ దర్శనం అందుకున్నారు….

Read More

మావుళ్ళమ్మ వారి ఆలయం మంగళవారం మూసివేత.

భీమవరం: సూపర్వైజర్,28(తెలుగు న్యూస్ పవర్) ఈ నెల, 3 న, అనగా ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం గం.3: 20ని.ల నుండి సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వెల్లడించారు. ఆ రోజు మంగళవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఉదయం, ప్రాతః కాల…

Read More

మావుళ్ళమ్మ ఆలయ సిబ్బంది నూతన కార్యవర్గం ఏర్పాటు.

భీమవరం: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సిబ్బంది యూనియన్, రెలిజియస్ మరియు సెక్యులర్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గంఇటీవల ఏర్పాటయ్యింది. నూతన కార్యవర్గము: 1. బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, అధ్యక్షులు 2. ⁠నల్లం లోకనాథరావు, ఉపాధ్యక్షులు 3. ⁠పోసింశెట్టి శ్రీనివాస్ బాబు, కార్యదర్శి 4. ⁠తుల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి 5. ⁠కడలీ అనంతరావు, కోశాధికారి 6. ⁠కపిలేశ్వరపు వెంకటేశ్వరరావు, సంయుక్త కోశాధికారి 7. ⁠కొడమంచిలి కొప్పేశ్వరరావు, సభ్యులు…

Read More

కనుల పండుగగా కనకదుర్గమ్మ కళ్యాణం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చిట్టి సాయి కుమార్,ఈశ్వరి దంపతులు, కల్యాణోత్సవం జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, తులా రామలింగేశ్వరరావు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు…

Read More

అంగరంగ వైభవంగా మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా గురువారం రాత్రి జరిగింది. దాదాపు పది రకాల వివిధ ఈవెంట్లతో జాతర భారీగా సాగింది. గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఈవెంట్లతో జాతర జరగలేదు. అమ్మవారిని అలంకరించిన హంస వాహనంపై జాతర గ్రామోత్సవంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. అమ్మవారి ఆలయం ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనకదుర్గమ్మ అమ్మవారు కనపడి,ఈ జాతర అమ్మవారికి సంబంధించిన…

Read More

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారికి భారీగా హుండి ఆదాయం.

భీమవరం: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి గురువారం లెక్కించారు. ఇప్పటివరకు గడిచిన 28 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.51,52,032. లు (అక్షరాలా యాభై ఒక్క లక్ష యాభై రెండువేల ముప్పై రెండు రూపాయలు) భక్తులు నగదు రూపంలో కానుకలుగా సమర్పించారు. బంగారం 33 గ్రాములు 240 మిల్లీగ్రాములు, వెండీ 189 గ్రాములు మరియు పలు దేశముల…

Read More

నేడే మావుళ్ళమ్మ వారి హుండీ లెక్కింపు.

భీమవరం: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీలిక్కింపు కార్యక్రమం బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహిస్తారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, బొండాడ నాగభూషణం, సభ్యులు, అసిస్టెంట్ కమిషనర్ జి. మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Read More

అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి వర్మ.

తిరువనంతపురం/నరసాపురం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్సభ సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సోమవారం, కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో వల్లూరి జయప్రకాష్ తదితర బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Read More

భక్తుల మారేడు దళ ప్రదక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి, 23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సప్త ప్రదర్శనలో సోమవారం సాయంత్రం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది ఏడు మారేడు దళములతో, సప్త ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకులు క్రిష్టప్ప సప్త ప్రదక్షిణముల విశేష ఫలితములు గురించి భక్తులకు తెలియజేశారు. రాత్రి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు,…

Read More