Telugu News Power

కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత

రోడ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం మంత్రి నిమ్మల కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు ఐదు కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అడివిపాలెం మల్లంపల్లి నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రంలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రోడ్లు వేయడం వల్ల రవాణా వ్యవస్థ…

Read More

సీఎం సహాయ నిధి నుంచి 21 లక్షల చెక్కులు పంపిణీ

మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి నుంచి సత్వరం నిధులు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వారి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 10 కోట్ల రూపాయల నిధులు సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందాయన్నారు….

Read More

నర్సాపురానికి వందే భారత్ వరం

నరసాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురానికి వందే భారత రైలు రాబోతున్నట్టు వెల్లడించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నరసాపురం – తిరుపతి, మచిలీపట్నం – బీదర్ తదిత రైళ్ళు అప్పటి మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ వల్ల వచ్చాయి. ఆ తరువాత అమరావతి,…

Read More

వందేమాతరం గీతంకి నేటికీ 150 ఏళ్లు

భారత జాతీయ గీతం నేటికీ 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం వందేమాతర గీతంతతో మారుమ్రోగిపోయింది. బక్కిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం నాడు 35 కోట్ల ఆత్మగా విరాజిల్లుతూ, నేటి 150 కోట్ల మంది భారతీయుల సంగీత సంతకం సిగ్నేచర్ ట్యూన్ గా నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ధ్వనిస్తూ ఉంది. ఈ విశ్వంలో ఎక్కడ ఉన్న ఈ గీతంతో పులకించని భారతీయ హృదయం ఉండదు. తెల్ల ముష్కరుల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన గుండెలను చీల్చితే,…

Read More

కార్తీక మాసం లో ఓ ముఖ్యమైన ఘట్టం జ్వాలా తోరణం

  పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారమలిగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణ కార్యక్రమం శాస్త్రోత్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్ని శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటూరు. అయినా పంచారామ క్షేత్రాల్లో మాత్రం కృత్తిక నక్షత్రం రోజున జరుపుతారు. భక్తులు, ఆలయ ధర్మ కర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ కర్తలు పినిశెట్టి శ్రీనివాస్, బసవ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది భక్తులకు జాగ్రత్తలు…

Read More

పాలకొల్లులో టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

పాలకొల్లులో టెన్నిస్సంరంభం ప్రారంభం ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈనెల 8 నుంచి 14 వరకు జరుగుతుందని పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 200 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటారు. బహుమతి ప్రధానోత్సవం ఈనెల 14న జరుగుతుందన్నారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు,…

Read More

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం పౌర్ణమి సందర్భంగా బుధవారం పోటెత్తిన భక్తులు. యలమంచిలి శివాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి జ్వాలతోరణ ఉత్సవం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అడబాల శ్రీమన్నారాయణ, వారి ధర్మకర్తలు, ఈవో, అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, సుబ్రమణ్యం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష కార్యక్రమాన్నీ తిలకించేందుకు విశేషంగా తరలివచ్చారు. జ్వాలా తోరణం నుంచి తీసిన వరి గడ్డి పశువులకు…

Read More

పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు

పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారు ఝాము నుంచి భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని వివిధ ప్రాంతాలలో అభిషేకాలు నిర్వహించారు. గోశాలలో కార్తీకదీపసమర్పణ చేశారు. కలువలు, మర్రి ,ఉసిరి వంటి శివునికి ప్రీతిపాత్రమైనవి భక్తులు సమర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు ,వారి ధర్మకర్తలు ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వారి సిబ్బంది, చాంబర్స్ కాలేజీ విద్యార్థులు, పోలీసులు ఈ రద్దీని క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు.

Read More

సర్పంచ్ ల వాకౌట్, ఛాంబర్ అధ్యక్షునీ రాజీనామా.

    మండల పరిషత్ అభివృద్ధి ఇన్చార్జ్, అధికారి జెడి ప్రసాద్ తమున అవమానించారంటూ సర్పంచులు చాంబర్ అధ్యక్షులు నిరసన తెలిపారు. మండల పరిషత్ నిధులు కోటిన్నర రూపాయలు వివిధ గ్రామాలకు పంచే విషయంలో ఎంపీడీవోని సంప్రదించగా మీకు చెప్పవలసిన అవసరం లేదని, అవమానించారన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చేసిన వ్యాఖ్యలు మొత్తం సర్పంచ్ల అందరిని అవమానించినట్టేనని, కనుక తాను చాంబర్ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తున్నట్టు పెనుమూరు సర్పంచ్ కౌరు గోపి ప్రకటించారు. వీరితోపాటు కాజ…

Read More