Telugu News Power

Telugu News Power

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామియే మా రక్షకుడు-ఎమ్మెల్యే దేవర ప్రసాద్.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహుడే తమను కాపాడుతున్నాడని, జనసేన నాయకులు, రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ వెల్లడించారు. స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కార్యక్రమం సందర్భంగా, గురువారం, వరప్రసాద్ మాట్లాడారు. మోంత తుఫాను, ఇరుసుమండ బ్లో అవుట్ నుంచి ఆ నరసింహస్వామి కాపాడారని తెలిపారు. ఈ క్షేత్రంలో తొమ్మిది బుధవారాల ప్రాశస్త్యం గురించి చాగంటి వారు తన ప్రవచనంలో తెలియజేయాలని కోరారు. దాదాపు 34 ఎకరాలు…

Read More

దివీస్ కంపెనీలు 7మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) దివీస్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏడు మంది ఉద్యోగాలు సాధించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో గురువారం జరిగిన ఈ ఇంటర్వ్యూలకు 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దివిస్ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పూర్ణ ప్రసాద్, శరత్ అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. విజేతలకు 18 వేల నుండి 24 వేల రూపాయల వరకు వేతనం ఇస్తారు. వీటితోపాటుగా ఇతర అలవెన్సులు, పిఎఫ్, ఈఎస్సై వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో…

Read More

మహాశివరాత్రి ఏర్పాట్లపై తహశిల్దార్, సమన్వయ కమిటీ సమావేశం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు…

Read More

క్యాన్సర్ నివారణకు కంకణ బద్దులు కావాలి- పద్మభూషణ్ చిరంజీవి.

హైదరాబాద్: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) క్యాన్సర్ వ్యాధి నివారణకు అందరూ కంకణ బదులు కావాలని ప్రముఖ జనం చిత్ర నటులు, సమాజ సేవకులు, పద్మభూషన్ కొణిదల చిరంజీవి పిలుపునిచ్చారు. క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ కిమ్స్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్ నివారణ తొలిదశలో గుర్తించగలిగితే 90 శాతం పూర్తిగా వివరించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. తాను ముందు చూపుతో పరీక్షలు చేయించుకోవడం వల్ల, ప్రియులకు సంబంధించి…

Read More

బాల టెన్నిస్ క్రీడాకారునికి, గాంధీ భగవాన్ రాజు అభినందన.

పాలకొల్లు: ఫిబ్రవరి, 4(తెలుగు న్యూస్ పవర్) బాల టెన్నిస్ యోధుడు దార్షిక్ ను, స్థానిక కాష్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో, సభ్యులతో కలిసి అభినందనలు తెలియజేశారు. దార్షిక్ 2025 టెన్నిస్ బెస్ట్ ప్లేయర్ కప్ సాధించారు. సౌత్ ఇండియన్, టెన్నిస్ టోర్నమెంట్లో ఈ బాలుడు రన్నర్ గా వచ్చాడు. ఈ పోటీలు విజయవాడలో ఆదివారం జరిగాయి. బాలుర 9 ఏళ్లలోపు విభాగంలో ఈ అవార్డు…

Read More

జనసేనకు బొలిశెట్టి దూరం.

విశాఖపట్నం: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీకి దూరంగా ఉండబోతున్నట్టు బుధవారం విశాఖపట్నంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తాను పార్టీలో నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలకు వెంటనే వర్తిస్తుందని తెలిపారు. పార్టీల మధ్య విభేదాలు పొడచూపుకుండా ఉండేందుకు జనసేన పార్టీ తరపున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అంతకుముందు జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం, పదవులు కేటాయించడం లేదని, బొలిశెట్టి బహిరంగ వేదికలపై అసంతృప్తి వ్యక్తం…

Read More

ట్రంప్ టారిఫ్ తగ్గింపు, ఆక్వారంగానికి ఊపు.

అమరావతి: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విధించిన పన్ను 7శాతం ట్రంప్ ప్రభుత్వం తగ్గించడం, ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తుందని వ్యవసాయ, మత్స్యశాఖామాత్యులు కింజరపు అచ్చం నాయుడు బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఇందుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.గతంలో ఈ పన్ను 25 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఆ పన్ను 18 శాతానికి కుదించారు. ఇందుకు అదనంగా అపరాధ రుసుము కూడా గతంలో వసూలు చేయడంతో సుమారు 58%…

Read More

సామూహిక ఎలుక నిర్మూలన.

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) వ్యవసాయ శాఖ చేపట్టిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం బుధవారం వివిధ మండలాల్లో జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ఎలుకల నిర్మూలన కోసం స్వయంగా, ఎరను తయారుచేసి ఆగర్తిపాలెం రైతులకు పంపిణీ చేశారు. రైతులకు, కౌలు రైతులకు ప్రభుత్వం ఉచితంగా పంచుతున్న బ్రోమోడియోలిన్ వాడి ఎలకల నుంచి పంటను రక్షించుకోవాలని ‘కోడి’ కోరారు. ఈ కార్యక్రమంలో ఆగర్రు సోసైటీ అధ్యక్షులు జాన్ రాజు, సర్పంచ్ కావలి…

Read More

ఉద్యోగుల 35 వేల కోట్ల బకాయిలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. -రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘం డిమాండ్.

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే, ఈ ఏడాది బడ్జెట్లో ఉద్యోగులకు చెల్లించవలసిన 35 వేల కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కేటాయింపులు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి, పితాని సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ ను కలిసి వేరువేరుగా వారికి వినతి పత్రాలు అందజేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు, ప్రజా ప్రతినిధులకు…

Read More

దివిస్ కంపెనీలో ఉద్యోగాలు

పాలకొల్లు: ఫిబ్రవరి,3(తెలుగు న్యూస్ పవర్) చాంబర్స్ కళాశాల ప్రాంగణ ఎంపికల కార్యక్రమంలో భాగంగా ఈ నెల5న (గురువారం)ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు,కళాశాలలో, ఇంటర్వ్యూలు జరుగుతాయని, ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వర్రావు వెల్లడించారు. బీఎస్సీ, బీటెక్, ఎమ్మెస్సీ, బిఫార్మసీ, ఎంఫార్మసీ చదివినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. కేవలం పురుషు అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. నెలకు వేతనం 18,000-24000 వేల రూపాయల వరకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు,…

Read More