Skip to main content

Telugu News Power

Telugu News Power

రాయలు,రంగా విగ్రహాలు ఆవిష్కరించిన మంత్రి కందుల, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి.

పెరవలి: ఆగస్టు,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలో శ్రీకృష్ణదేవరాయ కాపు ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, పేద, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన రంగా విగ్రహాలను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారితో కలిసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాంతికి ప్రతీకగా కపోతాలను ఎగురవేసి, గ్రామంలోని…

Read More

పెద గోపురం మాడవీధుల్లో భక్తుల సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఆగస్టు,24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సుమారు 350 మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తదుపరి రాత్రి, ధూప సేవ, పంచ హారతులు సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పి వాసు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీ అద్దేపల్లి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సోమవారం నిర్వాహంచారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్నమాణిక్యం అధ్యక్షతన భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, 2023 ఆగస్టు 23న భారతదేశం చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్…

Read More

భక్తులకు రుద్రాక్షల పంపిణీ.

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం ఉదయం శ్రీ లీలా కళ్యాణమండపం నందు సుమారు వెయ్యి మంది భక్తులకు అరుణాచలం మాతాజీ గాందీమధి, వారి కుమారుడు హరిహరణ్, ప్రకాష్ , భక్తులకు రుద్రాక్షలు అందజేసారు. ఈ కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, స్థానిక బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్, ఆలయ ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్,…

Read More

ఇస్రో ప్రధాన కార్యాలయంలో అధ్యయన పర్యటనకు ఎంపీ పాక సత్యనారాయణ.

బెంగళూరు:ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అంతరిక్ష భవన్‌ ప్రధాన కార్యాలయంలో డిపార్ట్మెంట్ అఫ్ స్పేస్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ ఎస్ ఎఫ్ సి) ప్రతినిధులతో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ సమావేశమయ్యారు. భారత అంతరిక్ష కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. గగన్‌యాన్ ప్రయోగం, ఆదిత్య-ఎల్ 1 మిషన్ మరియు ఇస్రో భవిష్యత్ అంతరిక్ష మిషన్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలపై…

Read More

టంగుటూరికి భారతర రత్న ఇవ్వాలి. ఆంధ్ర కేసరి టంగుటూరి 154వ జయంతి కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్

పాలకొల్లు: ఆగస్టు,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్దా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుక ఘనంగా జరిగింది. ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ, ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత…

Read More

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు.

హైదరాబాద్: ఆగస్టు,23 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మద్యం రవాణా కుంభకోణం కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును స్థానిక కొండాపూర్‌లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు – మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను ఈడీ అరెస్టు చేసింది. కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి,…

Read More

యూత్ హాస్టల్స్ అసోసియేషన్, ఆంధ్రా అధ్యక్షులుగా, డాక్టర్ వర్మ.

పాలకొల్లు: ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్) యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర శాఖకు అధ్యక్షులుగా డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, స్థానిక యూత్ హాస్టల్స్ అధ్యక్షులు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డాక్టర్ వర్మ కు ఘన సత్కారం జరిగింది. ఈ సభకు నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, భాస్కర్, కార్యదర్శి, వి ప్రసాద్,…

Read More

ఐక్య పోరాటాలే, ఆక్వా సమస్యలకు పరిష్కారం. -రాష్ట్ర అధ్యక్షులు గాంధీభవన్ రాజు

పాలకొల్లు: ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పోరాటాల ద్వారానే పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. అక్వా రైతులను సంఘటిత పరచడం కోసం భగవాన్ రాజు, రాష్ట్ర అధ్యక్షుని హోదాలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా భగవాన్ రాజు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు ఆక్వా రైతుల సంఘంతో ఆదివారం భగవాన్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

తిల్లపూడి కైలాసవనంలో మంత్రి నిమ్మల శ్రమదానం. చేయి కలిపిన మహిళాలోకం .

పాలకొల్లు:ఆగస్టు,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్మశానవాటికలను కైలాసగిరిలుగా సుందరీకరించే ప్రణాళికలో భాగంగా, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం తిల్లపూడిలో శ్రమదానం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్) నిధుల నుంచి మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇందుకు రూ. 50 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి, గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపి, మహిళలు కూడా ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. మంత్రి పారకొట్టి, చెట్లు కోసి,…

Read More