Telugu News Power

Telugu News Power

రామదాసు కు ఎస్పిఓగా పదోన్నతి.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక కోడిగట్టు సూర్యదేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త, కళాకారులు, ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసిస్ట్ మేడికొండ రామదాసు ఎస్ పి ఓ గా పదోన్నతి పొందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వీరు తణుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన రామదాసుని పలువురు అభినందించారు.

Read More

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బొర్రా గోపీమూర్తి.

యలమంచిలి:మే,5(తెలుగు మూవీస్ పవర్.కాం) పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో తన స్వగ్రామైన నార్నిమెరక పంచాయతీ గమల్లపేటలో అంబేద్కర్ విగ్రహానికి, దివంగత టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చిత్రపటానికి, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుపిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్, రాష్ట్ర బాధ్యులు రామానుజ రావు జిల్లా కార్యదర్శి రామకృష్ణ యుటిఎఫ్ పూర్వపు రాష్ట్ర కార్యదర్శి ఎస్ జయప్రభ సిఐటియు…

Read More

పదవతరగతి ప్రతిభావంతులకు యూటీఎఫ్ అభినంద సభ

యలమంచిలి:మే,5(తెలుగు న్యూస్ పవర్. కాం) పదవ తరగతి అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మట్లపాలెం లో మంగళవారం సత్కార సభ జరిగింది. స్థానిక యుటిఎఫ్ మండలంలో శాఖ ఆధ్వర్యంలో ఈ అభినందన కార్యక్రమం జరిగింది.మండలంలోని ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి అలాగే మండలంలో ఉన్న 11 ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలలో లో ప్రథమ స్థానం సాధించిన వారికి,550 మార్కులు పైబడిన విద్యార్థులకు ఉభయగోదావరి జిల్లాల…

Read More

పోతనకు బహుమతి తెచ్చిన “జయహే”.

గుంటూరు/పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో, ప్రముఖ సినీ,నాటక రచయిత, పాలకొల్లుకు చెందిన వీర పోతన రచించిన “జయహే” నాటిక ప్రధమ బహుమతి గెలుచుకుంది. గుంటూరు, కొలకలూరు నాటక పరిషత్ వారు ఈనాటికి పోటీలు నిర్వహించారు. పోతనకు 20వేల నగదు బహుమతి, షీల్డ్ ఇచ్చి పరిషత్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు గోపరాజు రమణ, విజయ్, పలువురు నాటకరంగ పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ ప్రముఖులు,నటీనట సమాఖ్య…

Read More

ధర్మ రావు ఫౌండేషన్, అగ్ని బాధితులకు సాయం.

పాలకొల్లు: మే,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లంకలకోడేరు గ్రామంలో అగ్ని బాధితులకు ధర్మారం ఫౌండేషన్ వారు మంగళవారం సాయం అందజేశారు. మూడు కుటుంబాల వారు ఈ అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులయ్యారు. వీరికి 26 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పాముల రజిని కుమార్, ఆకుల ధనలక్ష్మి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read More

మద్యం షాపులో అగ్ని ప్రమాదం. రూ. 1.40 కోట్ల మద్యానికి ముప్పు.

యలమంచిలి:మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాలంపూడి గ్రామంలో బూన్ వైన్స్ షాపులో అగ్నిప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో తమకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా గుర్తించినట్టు నరసాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మంగళవారం తెలియజేశారు. ఈ షాపులో రూ. 1.40 కోట్ల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో 90 శాతం వరకు సరుకు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న కూడా ఉన్నా కూడా కొంత…

Read More

డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలమూరు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేశారు. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (ఎన్ ఇ సి సి) వారి సౌజన్యంతో 50 వేల రూపాయల విలువైన, వ్యాపారానికి అవసరమైన బండి కుర్చీలు, ఇతర సమస్త సామాగ్రి ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం డ్వాక్రా పథకం తీసుకువచ్చారన్నారు….

Read More

ఒక్క పూట మాత్రమే కుళాయినీరు. -పురప్రజలు సహకరించాలి కమిషనర్ విజయ సారధి.

పాలకొల్లు: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్). ఈనెల 8 నుంచి ఒక్క పూట మాత్రమే రక్షిత మంచినీరు సరఫరా జరుగుతుందని పొరపాలక సంఘ కమిషనర్ విజయ సారథి మంగళవారం ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం గం. 6 నుంచి గం.7 వరకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. సాయంత్రం పూట నీటి సరఫరా జరగదని వెల్లడించారు. రైతులకు అవసర మైన సాగునీటి సరఫరా కోసం కాలువల తవ్వకం, వంతెనల నిర్మాణం వంటి పనుల వల్ల కాలువలకు నీటి సరఫరా…

Read More

పంచారామ క్షేత్రం క్షీరా రామంలో గణపతి హోమం

పాలకొల్లు: మే,5 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమమం నిర్వహించారు. ఈ పూజలో 17 మంది దంపతులు పాల్గొన్నారు. శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం వద్ద భక్తులచే అభిషేక పండితులు భమిడి పాటి వెంకన్న పూజలు జరిపించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వీరికి దేవస్థానం కార్యనిర్వాణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు…

Read More

అధికార మార్పిడితో మారిన భారత రాజకీయ ముఖచిత్రం.

జనరల్ డెస్క్: ఏప్రిల్,4(తెలుగు న్యూస్ పవర్. కాం) ఈ ఏడాది, ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల చారిత్రాత్మక ఫలితాలు భారతదేశ రాజకీయ భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరింపచేసాయి. బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది, తమిళనాడులో టీవీకే షాక్ ఇచ్చింది, కేరళలో ఎర్రజెండా అధికారం పోగొట్టుకొని, దేశంలో కమ్యూనిస్టులకు ఉన్న ఒకే ఒక్క అధికార పీఠం 50 ఏళ్ల తరువాత కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారం చేపట్టి, తన ఉనికిని కాపాడుకుంది. పుదుచ్చేరి ఎన్నికల్లో మళ్లీ అధికారం…

Read More