Telugu News Power

Blog

ఉపసభాపతి పై ఆరోపణలు తీవ్రంగా ఖండించిన సతీష్ రాజు.

ఉండి: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) ఉప సభాపతి, స్థానిక ఎమ్మెల్యే, కనుమూరి రఘురామకృష్ణ రాజు పై ఉండి మండలం, వెలివర్రు గ్రామ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వర రాజు, అలియాస్ బుడ్డియ్య రాజు చేసిన తీవ్రమైన, అనుచిత వ్యాఖ్యలను పత్రికా సమావేశంలో కల్లేపల్లి సతీష్ రాజు తీవ్రంగాఖండించారు. నియోజకవర్గ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టు సతీష్ రాజు తెలిపారు. బుడ్డియ్య రాజు ఉన్మాదిగ మారి ఆధారాలు లేని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,…

Read More

ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుచే అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం.

కాళ్ళ: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రాతాళ్ళమెరక గ్రామంలో పలు అభివృద్ధి పథకాలకు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీ ఐ ఐ డి సి చైర్మన్, స్థానిక మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు రామరాజు,ప్రారంభోత్సవం చేశారు. విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్,30వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రాతాళ్ళమెరకలో భారీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరిగాయి. కాళ్ల మండలం ప్రాతాళ్ళమెరకలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సిమెంట్…

Read More

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన మరో ఆణిముత్యం హర్ష.

యలమంచిలి: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి హర్ష శ్రీ వినయ్ జేఈఈ మెయిన్స్ లో ఆణిముత్యమై మెరిసాడు. హర్ష 99.97 పర్సంటెయిల్ తో మెయిన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. జనవరిలో జరిగిన జే ఈ ఈ మెయిన్స్ పరీక్షకు సుమారు13 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తమ్మినీడి(నందమూరి) శ్రీనివాసు, అరుణ దంపతులకు మొదటి సంతానం హర్ష. చదువులో తొలి నుంచి చురుగ్గా ఉంటూ, ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అనేక…

Read More

చాంబర్స్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.

స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సౌజన్యంతో 7 రోజులు పాటు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ జరిగింది.ఈ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు గారు హాజరై తమ కళాశాలలో విద్యతో పాటుగా, కమ్యూనికేషన్ స్కిల్స్, మెడికల్ కోడింగ్, రీజనింగ్, అర్థమెటిక్ ఆప్టిట్యూడ్, హెచ్ ఆర్ స్కిల్స్ లాంటి వాటిని విద్యార్థులకు అందించుట ద్వారా విద్యార్థులలో పోటీ…

Read More

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి బంగారు కానుక.

భీమవరం: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ఆరాధ్య దైవం, శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి, పాలకొల్లు మండలం, పూలపల్లి కి చెందిన మాదు మాణిక్యాలరావు శేషారత్నం దంపతులు సుమారు 90 వేల రూపాయల విలువైన,6 గ్రాముల బంగారం విరాళంగా అందచేసినారు వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు.ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, యు మీనాక్షి,…

Read More

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏట ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం. జగతిలో అమ్మ తర్వాత అమ్మ అంత విలువ గలిగినది అమ్మ నుడియే(మాతృభాష) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ ఒక మనవి . మనలో ఎంతమందికి మాతృభాష పై అభిమానం ఉన్నది. అసలు నేడు ఎంత మంది మాతృభాష గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది .మనలో చాలామందికి తెలియని…

Read More

క్షయ వ్యాధి పరీక్షలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో టీబీ వారోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రవిబాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి క్షయ అనుమానిత గలవారికి రెండు వారాల మించి దగ్గు,జ్వరం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం లక్షణాలు గల వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్షయ నిర్ధారణ పరీక్షలు చేసి మరియు అవసరమైన…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ వారి సారె.

యలమంచిలి: ఫిబ్రవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి మూల విరాట్ నూతన ఆలయ ప్రవేశం, సందర్భంగా, యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం అపూర్వం.

యలమంచిలి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం నభూతో, నభవిష్యతి అన్న రీతిలో అపూర్వంగా, అద్భుతంగా జరిగింది. యలమంచిలి ఆధ్యాత్మిక చరిత్రలో, మరో 100 ఏళ్ళ వరకు ఇలాంటి ఘట్టం మళ్లీ ఆవిష్కృతం కావటం ఒక అరుదైన ఘట్టంగా గ్రామస్తులు అంచనా వేస్తున్నారు. అమ్మవారి నూతన ఆలయ బింబ- యంత్ర- శిఖర ప్రతిష్ఠామహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా సంపూర్ణం అయ్యాయి. ఈనెల 18వ తేదీ నుంచి మొదలైన ఈ…

Read More

రైతులు వెంటనే ఈ-పంట నమోదు చేసుకోవాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి, 20(తెలుగు న్యూస్ పవర్) రైతులు వెంటనే ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని, స్థానిక వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ శుక్రవారంవిజ్ఞప్తి చేశారు. ఈనెల 25 ఈ-క్రాప్ నమోదుకు గడువు ముస్తుందని వెల్లడించారు. పాలకొల్లు మండలంలో 9,900, పోడూరు మండలంలో14,500, ఆచంట మండలం10, 250 ఎకరాల్లో దాళ్వాపంట సాగుతున్నట్టు నమోదయింది. ఇప్పటికీ కూడా కొంతమంది విదేశాల్లో ఉన్నవారు, రాస్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఓటిపి ద్వారా కూడా ఈ-నమోదు చేయించుకోవచ్చు అని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్(ఏపీ ఎఫ్ ఆర్)…

Read More