త్వరలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు – మంత్రి నిమ్మల
పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పేదలు, మహిళలు ఎప్పుడా,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఇక తన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో శనివారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు నిధులతో పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రగతినీ మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంపై، కూటమి నాయకులతో…