Telugu News Power

జాతీయ సార్వత్రిక సమ్మె ఘనవిజయం.

భీమవరం/పాలకొల్లు/యలమంచిలి: ఫిబ్రవరి, 12(తెలుగు న్యూస్ పవర్) అఖిలభారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మె ఘన విజయం సాధించిందని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడంపై, దేశంలోని ప్రముఖమైన 10 కార్మిక సంఘాలు గురువారం జాతీయ సార్వత్రిక సమ్మె జరిపాయి. కార్మికుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని కాలరాస్తూ, మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు వెంటనే ఉపసంహరించుకోవాలని…

Read More

మావుళ్ళమ్మ ను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.

భీమవరం: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) భీమవరం ఇలవేల్పు, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని, పోలీసు ఉన్నతాధికారులు గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, పండితులు, ఐజీ, అశోక్ కుమార్, ఎస్ పి, అద్నాన్ నయీమ్ హస్మి లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరిరువురికి, వేద ఆశీర్వచన పూజలు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చేయించారు. అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం, దేవాదాయ శాఖ, అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో డ్రోన్ పైలెట్ ప్రత్యక్ష శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం,స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్,…

Read More

దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీవోల సంఘీభావం.

పాలకొల్లు: ఫిబ్రవరి,12 (తెలుగు న్యూస్ పవర్) జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా, గురువారం, అఖిల భారత కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర యూనిట్ల తరఫున, స్థానిక ఏ పి ఎన్ జి ఓ యూనిట్ సంఘీభావం తెలిపింది. రాష్ట్ర, జిల్లా సంఘాల పిలుపుమేరకు, భోజన విరామ సమయంలో, స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఎన్జీవో నాయకులు, సభ్యులు, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ…

Read More

భారత్ రంగ్ మహోత్సవ్ లో కొంతేరు యూత్ క్లబ్ కు గుర్తింపు.

యలమంచిలి: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా,శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం, గుంటూరు, వేదిక(తెలుగు నాటక పరిశుద్ధుల సమ్మేళనం)వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న, భారత్ రంగ్ మహోత్సవ్ కార్యక్రమంలో, కొంతేరు యూత్ క్లబ్ గుర్తింపు లభించింది. కథకుడు, రచయిత, నాటక రచయిత, గుణ నిర్నేత, నిర్వాహకుడు, గంట కళ్యాణి నాయుడు ఈ సందర్భంగా పురస్కారం అందుకున్నట్టు, బుధవారం తెలిపారు. అంతర్జాతీయ నాటకోత్సవం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటక అకాడమీ…

Read More

పూలపల్లిలో మెగా పార్క్

పాలకొల్లు: ఫిబ్రవరి,11 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి గ్రామంలో గాంధీ మెగా పార్క్ నిర్మాణానికి, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో ప్రజలు, కుటుంబ సమేతంగా, ఆహ్లాదకర వాతావరణం లో గడపడానికి, అందరికీ అనువైన చక్కని ప్రదేశంలో ఈ పార్కు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయానికి, ఇతర కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పలువురు…

Read More

పూలపల్లి మరకతలింగ మహాక్షేత్రం సందర్శించండి.

-గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) ఫూలపల్లి లో వేంచేసి ఉన్న, శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత అమృత లింగేశ్వర ఆలయాన్ని శివరాత్రి రోజు దర్శించి, తరించవలసినదిగా గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాజీ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం, శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి…

Read More

దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీజీఓ అసోసియేషన్ మద్దతు.

భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12, 2026న జాతీయ సార్వత్రిక సమ్మె కు అలాగే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. అనుబంధ సంఘాలన్నీ సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చింది.ఏపీ ఎన్జీ జీవో అసోసియేషన్ సంఘీభావం తెలుపుతున్నట్లు, అధ్యక్షులు గుడాల హరిబాబు,కార్యదర్శి గుబ్బల ప్రసాద్ తెలిపారు. డిమాండ్లు: నూతన కార్మిక చట్టాల రద్దు,వేతన సవరణ, పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం…

Read More

ఏఎస్ఎన్ఎం కాలేజ్ విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ప్రాక్టికల్స్

పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్…

Read More

నేడే ఛాంబర్స్ కళాశాలలో ఆధునిక పాలనపై సదస్సు.

పాలకొల్లు: ఫిబ్రవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఫిబ్రవర,12న మధ్యాహ్నం 2 గంటల నుంచి “స్థానిక పాలనపై ఆధునిక పోకడలు” అన్న అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చైర్మన్, కారుమూరి నరసింహారావు తెలిపారు. ఈ సదస్సులో టంగుటూరి శ్రీరామ్, ప్రొఫెసర్ పి. మోహన్ రావు, సిహెచ్ విద్యాసాగర్, ఎన్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ బి. విజయ సారధి, తహసిల్దార్ వై దుర్గ…

Read More