Telugu News Power

ఎమ్మెల్సీ గోపి మూర్తి సేవలకు గుర్తుగా క్యాలెండర్.

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ గోపి

భీమవరం: డిసెంబర్,7(తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సంఘం తరఫున, వినూతన కార్యక్రమాలు చేపడుతున్న కాళ్ళ మండల శాఖను ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి అభినందించారు. ఎమ్మెల్సీగా పదవి చేపట్టి, తొలిఏడాది విజయవంతంగా, సేవలుపూర్తి చేసుకున్న సందర్భానికి గుర్తుగా, కాళ్ల మండల శాఖ క్యాలెండర్ రూపొందించారు. తన పేర ముద్రించి, సభ్యులకు కానుకగా ఇస్తున్న క్యాలెండర్ను గోపి మూర్తి స్వయంగా, భీమవరం జిల్లా కార్యాలయం నందు బుధవారం ఆవిష్కరించారు. యుటిఎఫ్ నాయకులు, పి.ఆరోగ్య స్వామి, పి.ఫిలిప్స్ న్ సౌజన్యంతో ఈ క్యాలెండర్ వెలువరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి నిరంతరం పాటుపడుతూ, పనిచేస్తున్న మండల శాఖ సేవలనను, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పిఎస్ విజయరామరాజు, పోలిశెట్టి క్రాంతి కుమార్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు, సిహెచ్ పట్టాభి రామయ్య, కార్యదర్శులు, జి రామకృష్ణంరాజు, సిహెచ్ బాబ్జి, కాళ్ళ మండల శాఖ అధ్యక్షులు బిఆర్ఎంకె. స్వామి, ఆడిట్ కమిటీ పూర్వ సభ్యులు పులఖండం శ్రీనివాస్, పి ఆరోగ్య స్వామి పాల్గొన్నారు.