Skip to main content

Telugu News Power

తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.

తిరుపతి: సెప్టెంబరు,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం గురువారం అరెస్టయ్యారు. అవినీతి నిరోధక శాఖ బుధవారం జరిపిన దాడుల్లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారం 2 కిలోలు, వెండి 6.5 కిలోలు, నగదు రూ.12 లక్షలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లోకం ఆదరణ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు.

భీమవరం: సెప్టెంబర్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం ఉదయం 9.00 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈ సందర్బంగా,కుంకుమ పూజలు నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్,,ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు.

Read More

శ్రీ అదేపల్లి కళాశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు.

పాలకొల్లు:సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అదేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి (అటానమస్) కళాశాలలో వ్యాయామ,ఎన్.సి.సి (ఎన్ సీసీ ) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యం హాజరై, మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలుష్య రహిత సమాజం కోసం విద్యార్థి దశ నుంచే…

Read More

పోలీసు ల దాడి లో పట్టుబడ్డ రూ.3 కోట్ల గంజాయి.

అనకాపల్లి రూరల్ పోలీసుల మెరుపుదాడి.ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ అనకాపల్లి: సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అనకాపల్లి మీదుగా తుని వైపు తరలిస్తున్న 600 కిలోల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యాన్‌తో పాటు పైలట్‌గా వ్యవహరిస్తున్న హోండా సివిక్ కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్…

Read More

ఛాంబర్స్ విద్యాసంస్థలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు.

పాలకొల్లు:సెప్టెంబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశం గొప్ప సాంస్కృతిక మరియు సర్వమత సామరస్యత కలిగిన దేశంగా ప్రపంచ దేశాల మన్నలు పొందుతుందని, దీనిని పరిరక్షించుకొనుటకు విద్యార్థి దశలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అవసరమన్నారు. కళాశాల సెక్రెటరీ కేవీ…

Read More

బాంబే స్వీట్స్ అధినేత బాపిరాజుకు మండలి చైర్మన్ మోషేన్ రాజు పరామర్శ.

భీమవరం: సెప్టెంబర్,2 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ వ్యాపారవేత్త, స్థానిక బాంబే స్వీట్స్ అధినేత పొత్తూరి బాపి రాజు, మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులయ్యా. వారి కుటుంబాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు, వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉచ్చుల స్టాలిన్ బాబు, చించినాడ మాజీ సర్పంచ్ దంగేటి రాజమణి, పొత్తూరి రంగరాజు,ఏ . ఏస్ . రాజు,తదితరులు బుధవారం పరామర్శించి, సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read More

పిఠాపురంలో ఘనంగా జనసేన యువజన విభాగం‘జై కొట్టు’ ఆవిష్కరణ కార్యక్రమం.

ప్రత్యేక ఆకర్షణగా.. వేలాది బైకులతో ర్యాలీ జై జనసేన నినాదాలతో మారుమోగిన పిఠాపురం వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చిన ప్రత్యేక గీతం, ఏవీలు. వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కేక్ కటింగ్ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్థానం పిఠాపురం వేదికగా పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ ఆవిష్కార సభ బుధవారం జరిగింది. జన…

Read More

జననేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

యలమంచిలి: సెప్టెంబర్,2( తెలుగు న్యూస్ పవర్. కామ్.) మండలం లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17 వ వర్ధంతి సందర్భంగా, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో, మండల పరిషత్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణారాజు, సీఇసీ సభ్యులు గుణ్ణం నాగబాబు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు…

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారా? నీ ఇల్లు బంగారం కాను.

తిరుపతి: సెప్టెంబర్, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవినీతిపరులైన తిరుమల తిరుపతి అధికారుల ఇళ్లపై ఏసీబీ కొరడా ఝలిపించింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీఈవో లోకనాథం ఇంటిపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే అంత పని అయింది. లోకనాథం ఇల్లంతా వారికి కొత్తబంగారు లోకంలా కనిపించింది. బంగారు,వెండి ఆభరణాలు భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. లాకర్లలోను, బంధువు ఇళ్లలోనూ ఇంకెంతుందో చూడ వలసి ఉందని…

Read More

శ్రీ క్షీరా రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పూజలు.

పాలకొల్లు:సెప్టెంబర్,2( తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున, ఆయురారోగ్యాలతో ఉండాలని పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో జనసేన నాయకులు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, బుధవారం రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ఈ సందర్భంగా, పురోహితులకు వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి శ్రీ బోనం నర్సయ్య (చినబాబు), ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఏ…

Read More