Telugu News Power

ప్రపంచ ప్రఖ్యాత ఎముకల డాక్టర్ “సుంకర” కు ప్రముఖుల నివాళి.

పద్మశ్రీ అవార్డు స్వీకరిస్తున్న డాక్టర్ సుంకర
డాక్టర్ సుంకర కు నివాళులర్పిస్తున్న ఎంపీ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి

భీమవరం: జనవరి,24(తెలుగు న్యూస్ పవర్) ,ప్రపంచ ప్రఖ్యాత ఎముకల వైద్యులు, సుంకర ఆదినారాయణ రావు, విశాఖపట్నంలో ఇటీవలమరణించారు. ఈ సందర్భంగా,ఆయన స్వస్థలం భీమవరం లో ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. పోలియో రహిత, భారతదేశం, కలల సాకారం కోసం సుంకర అవిశ్రాంత కృషి చేశారని, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కొనియాడారు. పోలియో బాధితులకు, కొత్త జీవితం ఇవ్వడం కోసం, లక్షలాది శస్త్ర చికిత్సలు చేశారన్నారు. వీరి సేవలు గుర్తించి భారత ప్రభుత్వం, వీరికి పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించిందన్నారు. అంతటి గొప్ప వైద్యులు, లేకపోవడం తీరని లోటుని సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాలకొల్లు, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ బాబ్జి నివాళులర్పిస్తూ, ఐదున్నర దశాబ్దాలుగా, మూడు లక్షలకు పైగా పోలియో ఆపరేషన్ లు చేశారన్నారు. దేశవ్యాప్తంగా 989 పోలియో వైద్య శిబిరాలు నిర్వహించారని తెలిపారు. ఆయన అనేక పరిశోధనా పత్రాలు సమర్పించడమే కాక, ఆర్థోపెడిక్ పత్రిక సంపాదకుడిగా కూడా వ్యవహరించారన్నారు. వీరి మరణం, వైద్య ప్రపంచ తీరనిలోటని డాక్టర్ బాబ్జి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు. డాక్టర్ సుంకర సేవలను గుర్తు చేసుకున్నారు. వీరు, ప్రేమ ఆసుపత్రి ద్వారా ఎందరికో ఉచిత శస్త్ర చికిత్సలు చేశారన్నారు. వీరు జాన్సన్ అండ్ జాన్సన్ ఫెలోషిప్, మన్మోహన్లాల్ మెహతా అవార్డు, భగవాన్ మహావీర్ అవార్డ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు, ఎన్నో సత్కారాలు అందుకున్నారన్నరు. విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసి, విదేశాల్లో ఉన్నత వైద్య విద్య అభ్యసించి,ఆర్థోపెడిక్ సర్జన్ గా, అత్యున్నత స్థానానికి ఎదిగారన్నారు. వీరి తల్లిదండ్రులు, శేషమ్మ, కనకం స్వాతంత్ర సమరయోధులు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రఖ్యాత, న్యూరో సర్జన్ సుంకర బాల పరమేశ్వరరావు వీరి సోదరులు. వీరి భార్య శశి ప్రభ, కింగ్ జార్జ్ హాస్పిటల్ లో సూపరిండెంట్ గా పనిచేసొరు. వీరు తన 87వ ఏట కన్నుమూశారు. వీరి కుమార్తె శేష్ కమల్, కుమారుడు శశికిరణ్ లు ఇంగ్లాండ్లో స్థిరపడ్డారు. మరెందరో ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు వీరి సేవలు కొనియాడారు.