గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలపల్లిలోని వృద్ధాశ్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. వృద్ధులకు, నగదు, కొత్త బట్టలు, హై స్కూల్ విద్యార్థులకు, పుస్తకాలు, స్టేషనరీ, పదో తరగతి విద్యార్థులకు పరీక్షల రాసేవారికి సాయంత్రం అల్పాహారం నిమిత్తం దాత సి ఎస్ ఎన్ రాజు గారు ఏర్పాటుచేసిన 6000 రూపాయలు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేఎస్పిఎన్ వర్మ , డిటిడిసి బాబు , కే బుద్ధరాజు , వృద్ధాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పూలపల్లిలోని వృద్ధాశ్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్
వృద్ధులకు వస్త్రాలు బహూకరిస్తున్న గాంధీ భగవాన్ రాజు తదితరులు.