బొయసే: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)
అమెరికాలోని, ఇదాహో రాజధాని నగరం బొయసే లో నివసించే 9 ఏళ్ల బెన్ మిల్లర్ వయసులో చిన్నవాడై తన పెద్ద మనసు చాటుకున్నాడు.
.ఎక్కువ మంది పిల్లలు తాము దాచుకున్న డబ్బులు (లెమనేడ్ స్టాండ్‌తో సంపాదించిన డబ్బును) బొమ్మలు లేదా స్నాక్స్‌పై ఖర్చు చేస్తారు. కానీ మనం చెప్పుకోబోయే, బెన్ మిల్లర్‌కు మరో ఆలోచన వచ్చింది. అతని పెద్దమ్మతో ఇడహో హ్యూమేన్ సొసైటీకి వెళ్లిన తర్వాత, బెన్ ఒకటి గమనించాడు. వీధుల్లో ఉండే కుక్కలు, పిల్లులు వంటి జంతువులను కాపాడినప్పుడు, అవి తమ శాశ్వత గృహాల కోసం ఎదురుచూస్తుంటాయి. వాటి జీవితాలను కొంచెం సంతోషకరంగా ఉంచడానికి సౌకర్యాలు కల్పించాలని భావించాడు. ఈ బాలుడు7 ఏళ్ల వయసులోనే తన మొదటి లెమనేడ్ స్టాండ్‌ను ఏర్పాటు చేశాడు. రోజు ముగిసే సమయానికి 200 డాలర్లు సంపాదించి, అది అంతా షెల్టర్‌కు దానం చేశాడు.కానీ బెన్ ఇక్కడితో ఆపలేదు. వచ్చే సంవత్సరం 600 డాలర్లు సమకూర్చాడు. ఈ సంవత్సరం వెయ్యి డాలర్లు లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ సహాయంతో ఇంటి తయారీ కుకీస్, క్లాసిక్, లావెండర్ లెమనేడ్, వంటి వాటితో, అక్కడకు వచ్చి కుక్కలకు ఇందు భోజనం పెడతాడు. స్థానిక ప్రజల కమ్యూనిటీల నుంచి గట్టి మద్దతు లభించింది – ఆన్‌లైన్ డొనేషన్లు, రేడియోలో విని కార్లలో వచ్చిన సభ్యులు కూడా ఫండ్‌రైజర్ కార్యక్రమానికి తమ వంతు సహాయం అందించారు.బెన్ గర్వంగా ఇడహో హ్యూమేన్ సొసైటీలోకి 1,150 డాలర్లు సంకూర్చాడు. ఇప్పటికే ప్రేమతో కూడిన గృహాల కోసం ఎదురుచూస్తున్న జంతువుల సంరక్షణకు.గత మూడేళ్లలో, ఈ యువ జంతుప్రేమికుడు రక్షించిన పెట్స్‌కు సుమారు 2వేల డాలర్లు(దాదాపుగా రెండు లక్షల రూపాయలు) దానం చేశాడు. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం కుక్కల నిర్మూలన కోసం పోటీ పడుతున్నాం.
చిన్న వయసు, పెద్ద మనసు
బాల కర్ణుడు బెన్ మిల్లర్