Skip to main content

Telugu News Power

తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం పై నేడే జాతీయ సదస్సు.

పాలకొల్లు: మార్చి,23(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో నేడు, మంగళవారం జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సోమవారం తెలిపారు. తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం అనే అంశం మీద ఈ సదస్సు జరుగుతున్నట్టు వివరించారు. ప్రాచ్య పరిశోధన సంస్థ, చెన్నై,తెలుగు శాఖ అధిపతి, ఆచార్య విస్తాలి శంకర్రావు, ప్రారంభ సమావేశ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలుగు శాఖ, పూర్వ అధ్యక్షులు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సాంకేతిక సమావేశంలో కీలకోపన్యాసం చేస్తారు. ఈ సదస్సుకు ప్రిన్సిపల్ టీ. రాజరాజేశ్వరి అధ్యక్షత వహిస్తారు. తెలుగు శాఖాధిపతి, కన్వీనర్, డాక్టర్ బూసి వెంకటస్వామి సదస్సు నివేదిక సమర్పిస్తారు. ఆత్మీయ అతిథులు,టి కృష్ణ, వైస్ ప్రిన్సిపల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, డాక్టర్ ఎం రామకృష్ణ, జంతు శాస్త్ర విభాగాధిపతి, కో కన్వీనర్. డాక్టర్ విజయలక్ష్మి సదస్సుకు స్వాగతం పలుకుతారు. జీడి శ్రీనివాసరావు వందన సమర్పణ చేస్తారు. కళాశాల తెలుగు విభాగం వారు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.