Skip to main content

Telugu News Power

ప్రజా ఫిర్యాదులపై నాణ్యమైన పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ నాగరాణి

భీమవరం: మార్చి ,23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఫిర్యాదు దారుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వయంగా స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీలపై క్షుణ్ణంగా పరిశీలనచేసి, నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు చేపట్టి గడువులోపే సమస్యలు పరిష్కరించాలని సూచనలు చేశారు.
పీజీఆర్ఎస్‌లో 134, రెవెన్యూ క్లినిక్‌లో 40 దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.- మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌పోర్ట్, పోలీస్, రెవెన్యూ శాఖలకు కలెక్టర్ హెచ్చరిక జారీ చేశారు. ఏకీకృత కుటుంబ సర్వే డేటా సవరణకు గడువు నాటికి పూర్తి చేయకపోతే, చర్యలు తప్పవని హెచ్చరించారు.