
ముత్యాలతలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భువనేశ్వరి దంపతులు.
ఒంటిమిట్ట: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్ . కామ్)
ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం,
శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ రామచంద్రుడు, సీతామ్మ వారి దివ్య వివాహం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తి శ్రద్ధలతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఏకసిలా నగరం ఎల్లెఎడల, శ్రీ రామ నీ నామెంతో రుచిరా అంటూ మారు మోగిపోయింది.రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వేలాది భక్తులు దివ్య భవ్య కల్యాణాన్ని సాక్షాత్కరించి తరించారు.సాయంత్రం ప్రారంభమైన ఈ మహా కల్యాణ మహోత్సవం మంగళ్యధారణ, అక్షతారోపణం, మహాదశీర్వచనంతో సంపూర్ణం అయింది. కల్యాణ వేదిక చుట్టూ అమర్చిన గ్యాలరీల్లో భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యాల తలంబ్రాలు పంచి వారిని భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. రాష్ట్ర
విభజనకు పూర్వం భద్రాచలం రాముల వారి కళ్యాణం ఉత్సవం శ్రీరామనవ రోజున ముఖ్యమంత్రి జరిపించేవారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత అత్యంత ప్రాచీనమైన వైయస్సార్ కడప జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఒంటిమిట్ట ఏకశిలా నగరం లో ఉన్న కోదండ రామాలయాన్ని,రాష్ట్ర ఆలయంగా గుర్తించి, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా, శ్రీరామనవమి నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, మనవడు దేవాన్ష్ ఈ కల్యాణోత్సవాల్లో స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. కనుల పండుగగా జరిగిన ఈ కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమంది వీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు,టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు,
హెలిపాడ్ వద్ద పలువురు తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
