రాజమహేంద్రవరం: జూలై,20
( తెలుగు న్యూస్ పవర్. కామ్)
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు జీఎస్ రావుకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
స్వస్థలం పెద్దేవం గ్రామం సోమవారం, ఆయన నివాసానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు.
జీఎస్ రావు సతీమణి, కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడును ఓదార్చి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.
రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులర్పించి, జీఎస్ రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను స్మరించుకున్నారు.
మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, సాకే శైలజానాథ్ శ్రద్ధాంజలి ఘటించారు.
సీనియర్ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జీఎస్ రావు రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో చేసిన విశిష్ట సేవలను నేతలు కొనియాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావుకుశ్రద్ధాంజలి.
జిఎస్ రావుకు నివాళులర్పిస్తున్న వైసీపీ రాష్ట్ర నాయకులు