న్యూఢిల్లీ : జూలై 20, ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లను ఢిల్లీలో సోమవారం కలిసింది.
రొయ్యల మేత ధరల నియంత్రణకు జన్యు మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరింది.
అమెరికా, చైనా, ఐరోపా, తదితర ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆక్వా దిగుమతులపై సుంకం 10 శాతానికి తగ్గినా, ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోంది. టారిఫ్ సంక్షోభంపై కేంద్ర ఆర్థికశాఖ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల వరకూ వన్ టైమ్ టాప్అప్ ఇవ్వాలి. ఆక్వా ఉత్పత్తుల దేశీయ మార్కెటింగ్ కోసం జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(ఎన్ఎఫ్ డీబీ) ద్వారా రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటుచేయాలని కోరారు. ప్రస్తుతం రొయ్యల మేతలో ఉపయోగించే చేప పొడిని 5 శాతం ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతిస్తున్నారు. దీంతో దేశీయ ఫీడ్ తయారీదారులు ఆ పొడిని ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎగుమతుల్ని నియంత్రించాలని కోరారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు పురందేశ్వరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బీద మస్తాన్ రావు, మతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, పాకా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తదితరులు, కేంద్ర మంత్రులను కలిసిన ప్రతినిధుల బృందంలో ఉన్నారు.