Skip to main content

Telugu News Power

రాజ్యసభలో శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం ప్రత్యక్షంగా వీక్షించిన మంత్రి నారా లోకేష్.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అమర్చారు కిరణ్ రిజుజును కలిసిన లోకేష్ బృందం
ప్రధానమంత్రి మోడీతో నారా లోకేష్ బృందం

న్యూఢిల్లీ: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్). అమరావతిని శ్వాశ్వత రాజధానిగా చట్టం చేయడానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లు ఆమోదం పొందటాన్ని, రాజ్యసభలో ప్రముఖుల గ్యాలరీలో కూర్చుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ బృందం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల బృందంతో ప్రధాని మోడీని కలిసారు. అను మోడీ నారా లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. పార్లమెంటరీ శాఖ మాత్యులు కిరణ్ రిజుజు, లోకేష్ కు అభినందనలు తెలుపుతూ అమరావతి దినదిన ప్రవర్తమానం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు సీఎం రమేష్, కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ గ్యాలరీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్న నారా లోకేష్ బృందం
రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తున్న వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి