Skip to main content

Telugu News Power

వాకర్స్ క్లబ్ సహాయం

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శంభునిపేటకు చెందిన విల్లూరి మేరీ రత్నకుమారికి స్థానిక వాకర్స్ క్లబ్ వారు 6వేల రూపాయలు సహాయం అందించారు. భర్తను కోల్పోయిన ఈమె, పక్షవాతానికి గురైన కుమారునితో ఇల్లు గడవని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న వాకర్స్ క్లబ్ ఈమెకు నిత్యవసరాలు, నగదు సహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, జవ్వాజి కళ్యాణ్, ఉమా శంకర్, బసవరాజు, విజయానంద్ పాల్గొన్నారు.